కోవిడ్ నుండి రికవరీ అయ్యాక టూత్ బ్రష్ ని ఎందుకు మార్చాలి..?

-

కరోనా మహమ్మారి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. చాలా మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇటువంటి సమయంలో నిజంగా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కరోనా నుండి రికవరీ అయిన వాళ్ళు తప్పని సరిగా వాళ్ల యొక్క టూత్ బ్రష్ ని మార్చాలి.

అదేమిటి టూత్ బ్రష్ ని ఎందుకు మార్చాలి..? అన్న అనుమానం చాలా మందిలో ఉంటుంది. మరి దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి టూత్ బ్రష్ ని మార్చాలి. ప్లాస్టిక్ లో ఉండే వైరస్ ఎక్కువ కాలం పాటు ఉండగలదు. కనుక టూత్ బ్రష్ ని మార్చడం సురక్షితం. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత కూడా టూత్ బ్రష్ ని మార్చాలి.

దీంతో మళ్లీ మీరు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటారు. అదే విధంగా మీ కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటారు. అది ఎలా అంటే సాధారణంగా అందరూ వాళ్ళ యొక్క బ్రష్లని వాష్ రూమ్ లో పెడుతూ ఉంటారు.

ఒకరి బ్రష్ నుండి మరొకరి బ్రష్ కి వైరస్ అంటుకునే ప్రమాదం వుంది. దీంతో వాళ్లు కూడా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. కనుక కరోనా వైరస్ వచ్చి తగ్గిన తర్వాత తప్పకుండా టూత్ బ్రష్ ని మార్చండి. లేదు అంటే మీరు మరియు మీ వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news