మధాహ్న భోజనాల్లో ఎక్కువగా అన్నానికి ముందు స్వీట్లు సేవించమని వడ్డిస్తారు. కానీ, స్వీట్ ముందుగా తినకుండా భోజనం మొత్తం అయిన తర్వాత తింటుంటారు. అలా తినడం వల్ల ప్రయోజనం ఉండదు. దీనికో ప్రత్యేకత కూడా ఉందంటున్నారు ఆరోగ్యనిపుణులు. అసలు భోజనానికి ముందు స్వీట్లు ఎందుకు పెడతారు? తినడం వల్ల ఏమవుతుంది? అనే అంశాలను తెలుసుకుందాం.
అన్నదానం, రెస్టారెంట్లు, హోటల్స్‌లో అన్నం వడ్డించే ముందు తీపి రుచి చూపిస్తారు. ఇది కొత్త పరిచాయలకు ప్రతీక మాత్రమే కాదు. ఆరోగ్యానికి సంబంధిన సీక్రెట్ కూడా. ఏమిటంటారా? స్వీట్స్‌ను ఆహారానికి ముందు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత చివరిగా స్వీట్స్ తీసుకోకూడదని వారంటున్నారు. ఆహారం తీసుకునేందుకు ముందుగా ఆకలి కారణంగా పొట్టలో గ్యాస్ అధికంగా వ్యాప్తిస్తుంది. అలాంటి సమయంలో స్వీట్స్ తీసుకోవడం ద్వారా ఆ గ్యాస్ ప్రభావం మెల్లగా తగ్గిపోతుంది.
ముఖ్యంగా పండ్లు తీసుకోవడానికి ముందు స్వీట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహారం జీర్ణమైన తర్వాత పొట్టలో నిల్వ ఉండే వ్యర్థాలతో ఏర్పడే వ్యాధుల సంఖ్య అధికమైపోతున్నాయని, స్వీట్స్‌ను తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
నీరు ఎప్పుడు తాగాలి?
ఆహారం తీసుకునేందుకు ముందు నీల్లు సేవించడం కొందరి అలవాటు. మరికొందరైతే పూర్తిగా ఆహారం తీసుకున్నాక సేవిస్తారు. అయితే ఆహారం తీసుకుంటుండగా మధ్య మధ్యలో కొంచెం నీరు తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.
ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవచ్చా?
ఆహారం తీసుకున్న వెంటనే కళ్లుమూతలు పడుతుంటాయి. ఇంట్లో ఉంటే హాయిగా నిద్రపోతాం. అయితే ఆహారం తిన్నవెంటనే నిద్రపోకూడదు. రాత్రిపూట నిద్రించే రెండుగంటల ముందు ఆహారం తీసుకోవడం మంచిది. తద్వారా అజీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అంతేకాదు సేవించిన ఆహారం కూడా కొవ్వుగా మారే అవకాశం తక్కువగా ఉంటుంది.