ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌ పదార్థం ఎక్కువ శాతం ఉంటుంది.దీన్ని నేరుగా తీసుకోని వాళ్లు పాలతో లేదా ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్‌ మలబద్ధకాన్ని నివారించి, తిన్న ఆహారం జీర్ణమయ్యేలా చేస్తాయి. కడుపులో ఉండే విష వ్యర్థాల్ని తరిమికొడతాయి. దీంతో మీ పొట్ట శుభ్రం అవుతుంది.

kiss miss
kissmiss | కిస్మిస్‌

కిస్మిస్‌లో ఉండే ఐరన్, పొటాషియం, కాపర్‌ ఉంటాయి. ఏసీడీటీ లాంటి సమస్యలు తగ్గుతాయి. కిస్‌మిస్‌లో సోడియం శాతం తక్కువగా ఉంటుంది. ఇది మన గుండె కండర కణాలకు మేలు చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే… ఎండిన ద్రాక్షను ప్రతిరోజూ తినాలి.

కిస్మిస్‌లో యాంటీఆక్సిడెండ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కేన్సర్‌ వైరస్‌ను నాశనం చేస్తాయి. కిస్‌మిస్‌ మన కళ్లను కాపాడుతుంది. కంటి సమస్యలకు చెక్‌ పెడుతుంది. అంతేకాదు, కాటరాక్ట్‌ సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఇక ఇన్ని ప్రయోజనాలు కిస్మిస్‌లో ఉన్నాయి కదా అని వీటిని మరీ ఎక్కువగా తినకూడదు. ఇవి అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అంతేకాదు, కిస్మిస్‌ ఎక్కువ తింటే ఫైబర్‌ ఎక్కువై పొట్ట ఉబ్బడం వంటి సమస్యలొస్తాయి. అందువల్ల ప్రతిరోజూ ఓ 20కి మించకుండా తింటే మేలే జరుగుతుంది. కిస్మిస్‌లో ఇన్ని పుష్కలమైన విటమిన్లు ఉన్నాయి. ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం అని మరచిపోకూడదు.