బరువు తగ్గించడం నుండి డయాబెటిస్ అదుపులో ఉంచేవరకు బెండకాయ చేసే మేలు..

బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని చెబుతారు. అందుకే చిన్నపిల్లలకి బెండకాయ వండిపెడతారు. బెండకాయల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వాటివల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రస్తుతం బెండకాయల వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం.

health benefits of lady finger

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తిని శరీరానికి అందించడంలో సాయపడుతుంది.

హృదయ సంబంధ సమస్యలను దూరం పెడుతుంది.

ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల హృదయ సంబంధ ఇబ్బందులకు తావు ఉండదు. అంతేకాదు చెడుకొవ్వును శరీరం నుండి బయటకు పంపించివేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

కంటిచూపు మెరుగుపడుతుంది

విటమిన్-ఏ, బీటా కెరాటిన్ కారణంగా కంటిచూపు మెరుగుపడుతుంది.

బరువు తగ్గిస్తుంది

బెండకాయలో కేలరీలు తక్కువ ఉంటాయి. అదీగాక అధిక శాతం ఫైబర్ కారణంగా కడుపు నిండుగా అనిపిస్తుంది. తద్వారా తక్కువ తింటారు. దాని మూలంగా బరువు తగ్గుతారు.

మలబద్దకాన్ని నివారిస్తుంది

ఆహారం సరిగ్గా జీర్ణం అవడంలో బెండకాయ బాగా పనిచేస్తుంది. క్రమంగా బెండకాయను ఆహారంలో చేర్చుకున్న వారు మలబద్దకం తదితర సమస్యలతో బాధపడకుండా ఉంటారు. ప్రేగులను శుభ్రపర్చడంలో కూడా సాయపడుతుంది.

రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది

ఇందులోని ఎజినాల్ అనే ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. అందుకే డయాబెటిస్ తో బాధపడేవారు బెండకాయలను ఆహారంలో తీసుకుంటే మంచిదని చెబుతుంటారు.

ఎనీమియాని నివారిస్తుంది

శరీరంలో రక్తం తగ్గి రక్తహీనత రాకుండా బెండకాయ కాపాడుతుంది. ఫోలేట్, విటమిన్ కె మొదలగునవి రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.

బెండకాయలు తింటే తెలివితేటలు పెరుగుతాయి.. మరి బెండకాయ నీరు తాగితే..?