శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో అనుభవించాలంటే కొంచెం క్రియేటివిటీ అవసరం. అది మీలో ఉందా అన్నది కింద చెప్పిన విషయాలను బట్టి తెలుసుకోండి.

పడక గది ఆవల రొమాన్స్

రొమాన్స్ అంటే గదిలో ఉన్నప్పుడు మాత్రమే కలిగే ఫీలింగ్ కాదు. బయట కూడా రొమాంటిక్ గా ఉండవచ్చు. చిన్న చిన్న ముద్దులు, కావాల్సి వస్తే హగ్గులు, మెచ్చుకోలు, పక్కనే ఉండాలని కోరుకోవడం. చిన్న చిన్న పనుల్లో సాయం చేయడం మొదలగు బయట చేసే పనులన్నీ పడక గదిలో శృంగారాన్ని ఆనందించేలా చేస్తాయి.

క్యాలెండర్ లో రాయడం

శృంగారానికి ఒక టైమ్ పెట్టుకుంటారు. దీనర్థం ఈ టైమ్ లో ఆనందించాలన్న ఉద్దేశ్యం కాదు. ఆ రోజులో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఊహల్లో తేలిపోతూ, కావాల్సిన వాటన్నింటినీ సిద్ధం చేస్తూ రొటీన్ కి భిన్నంగా గడపాలని ప్లాన్ చేస్తారు.

డేటింగ్ ప్రవర్తన

వివాహంలో సెక్స్ అనేది ఒక ప్రక్రియలా ముగిసిపోకూడదు. ఈ విషయం రతిక్రీడను ఆనందించేవారికి బాగా తెలుసు. అందుకే డేటింగ్ లో ఉన్నప్పుడు భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో భాగస్వామితో ఉన్నప్పుడు కూడా అలానే ప్రవర్తిస్తారు. అది అవతలి వారికి కొత్తగా అనిపించి, కొత్త కొత్త భావాలను పురికొల్పుతుంది.

ఆరోగ్యం గురించి శ్రద్ధ

సెక్స్ లైఫ్ లో ఆరోగ్యం పాత్ర వారికి బాగా తెలుసు. అదే కాదు లుక్స్, శరీరం ఫిట్ గా ఉంచుకునేందుకు తపిస్తారు. కష్టపడతారు. అవతలి వారు ఏది కోరుకుంటారో దాన్ని ఇవ్వడానికి వీరు సిద్ధంగా ఉంటారు.

పోలిక ఉండదు

అవతలి వారి శృంగార జీవితంతో తమ దాన్ని పోల్చుకోరు. ఎక్కువ శాతం ఇబ్బంది పడేది ఇక్కడే. అవతలి వారి ఆనందాన్ని చూసి మేమెందుకలా ఉండలేకపోతున్నామన్న ఆలోచనలో ఉన్న కాస్త ఆనందం కుడా దూరం చేసుకుంటారు. కానీ శృంగారాన్ని ఆనందించేవాళ్ళు ఈ విషయాల గురించి అసలు పట్టించుకోరు.