ఆవ‌లింతలు ఎందుకు వ‌స్తాయో తెలుసా..?

-

ఆవలింత ఎరుగని మనుషులు ఉండరు. మనుషులే గాక పిల్లులు, కుక్కలు, ఇతర కొన్ని జంతువులు కూడా ఆవులించడం జరుగుతుంది. మనం ఆవలిస్తే మనకి దగ్గరగా ఉన్నవాళ్లకి కూడా ఆవలింత వస్తుంది. ఆవలించడం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. జీవితాంతం ఉంటుంది. మనం జీవితకాలంలో సగటున 2.4 లక్షల సార్లు ఆవలిస్తాం. ఆవులింత అంటువ్యాధి కాదు కానీ… అది అంటుకోవడం మాత్రం నిజమనే అనుకోవాలి.  ఒక్కోసారి దేహంలో ఉత్సాహం కలిగినప్పుడు కూడా ఇవి వస్తాయి. అసలు ఇవి ఎందుకు వస్తాయో ఇప్పటికీ తెలియని రహస్యమే .ఇది సైన్స్‌కు అంతుచిక్క‌ని ఒక మిస్టరీ.

సగటున ఒక్కో ఆవలింత 6 సెకన్ల వరకూ ఉంటుంది. అయితే మనిషి జీవిత కాలంలో 400 గంటలు ఆవలించడానికి ఉపయోగిస్తార‌ట‌.  ఆతృత ఎక్కువ అయినప్పుడు,అలసి పోయినప్పుడు శ్వాస క్రియ జరగవలసినంత వేగంగా జరగదు. ఆవులింత దీన్ని భర్తీ చేస్తుంది.  నిద్ర‌లో ఉన్న శ‌రీరాన్ని రీప్రెష్ చేసేందుకు కూడా ఆవ‌లింత వ‌స్తుందట‌. ఈ ఆవ‌లింత‌తో శ‌రీరానికి ఉండే లేజీ నెస్ వెళ్లిపోతుంది.


మనలో చాలా మంది ఆవలింత రాగానే వెంటనే నిద్ర పోవాలనుకుంటారు. కాని ఆవ‌లింత నిద్ర‌కు సంకేతం కాదు. ఆవలించడం వల్ల మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి మెద‌డు మరింత షార్ప్ గా పనిచేస్తుంది. మ‌నకు ఎక్కువ ఆవలింతలు వస్తున్నాయంటే దానర్ధం, మెద‌డు త‌న‌ని తాను యాక్టివ్ గా  ఉంచుకోవ‌డానికి  ప్రయత్నిస్తుందని ప‌రిశోధ‌న‌లో తేలింది. అలాగే ఒకరిని చూసి మరొకరు ఆవలించడమనేది సహానుభూతికి సంబంధించినదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతారు.

Read more RELATED
Recommended to you

Latest news