ప్రాణాయామం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందా…?

-

ప్రాణాయామం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయని యోగా, ధ్యానం చేసే వారు చెప్తూ ఉంటారు. శరీరానికి మంచి గాలిని దీని ద్వారా అందించవచ్చని వైద్యులు కూడా చెప్తూ ఉంటారు. అంతే కాకుండా దాని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. ఒకసారి దాని ఉపయోగాలు చూద్దాం. మెదడు, శరీరం సేదతీరడానికి సహకరిస్తుందని అంటున్నారు వైద్యులు.

పది నిమిషాలు శ్వాసపై దృష్టి కేంద్రీకరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. ప్రతిరోజు ప్రాణాయామం చేయడం ద్వారా మెదడుకు రక్త సరఫరా మెరుగై మనసు ప్రశాంతంగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రాణాయామాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా ఊపిరితిత్తులకు గాలి పీల్చుకునే సామర్థ్యం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

అప్పుడు మన శరీరానికి ఆక్సీజన్ ని ఎక్కువ పీల్చుకోవచ్చు. మన శరీరంలోని అన్ని భాగాలకు సరిపడా ఆక్సిజన్‌ అందడం ద్వారా జీవక్రియలు సాఫీగా సాగుతాయని, దీనితో శరీరంలోని టాక్సిన్స్‌ బయటకు వెళ్లిపోతాయట. ఫలితంగా ఆరోగ్యం మెరుగవడంతో పాటు చర్మ సౌందర్యం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రాణాయామం వల్ల పొట్ట కండరాలు కూడా బలపడతాయట. శరీరంలో అనవసరమైన కొవ్వు పెరగదట.

Read more RELATED
Recommended to you

Latest news