యోగానే కదా అని లైట్ తీసుకోవద్దు…!

-

యోగా చేయడం వలన చాలా మందికి ప్రయోజనాలు తెలియక దాన్ని లైట్ తీసుకుంటారు. వైద్యులు చెప్పినా ఎవరు చెప్పినా సరే సిల్లీ గా తీసుకుని దానిది ఎం ఉందిలే అనుకుంటాం. కాని యోగా వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి. మన బద్ధక ప్రపంచానికి యోగాను చిన్న చూపు చూస్తాం కాని మాస్టారూ, దాని వలన ప్రయోజనాల ఫలితాలు పొందితే మాత్రం వదిలి పెట్టె అవకాశం ఎంత మాత్రం ఉండదు.

జుట్టు నుంచి అరికాలి వరకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అందుకే యోగాని అసలు వదిలిపెట్టవద్దని సూచిస్తున్నారు వైద్యులు. రోజులను బట్టి పరిస్థితులను బట్టి జ్ఞాపకాలు అనేవి ఉండటం లేదు. దాని నుంచి యోగా ద్వారా బయటకు రావొచ్చని అంటున్నారు వైద్యులు. ప్రతీ రోజు రోజూ క్రమం తప్పకుండా, యోగాసనాలు వేయడం ద్వారా మెదడు చురుకుగా ఉంటుందని బ్రెజిల్ పరిశోధకులు చెప్తున్నారు.

మన వయసు పైబడుతున్న కొద్దీ మెదడు నిర్మాణంతో పాటుగా పనితీరులో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్తున్న పరిశోధకులు దాని కారణంగా, సెరెబ్రల్‌ కార్టెక్స్‌ పలుచబడిపోతుందని చెప్తున్నారు. ఇది జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఏ విషయంపైనా ఏకాగ్రత కుదరదని, ఆ సమస్య నుంచి యోగా మనను బయటపడేస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news