ఈ 2 వ్యాయామాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు..

-

బరువు తగ్గాలని అందరికీ ఉంటుంది.. కానీ తగిన విధంగా డైట్, ఎక్సర్ సైజ్ చేసే టైం, ఓపికనే మనకు ఉండదు. గంటల తరబడి కష్టపడి జిమ్ లో వర్కౌట్ చేద్దామంటే.. టై సెట్ కావడం లేదు. అంత తీరిక కూడా ఉండటం లేదు కదా.. మరీ ఇక కఠినమై డైట్ ఫాలో అవుదాం అంటే.. మనసు ఒప్పుకోవడం లేదు. ఈరోజు నుంచి స్ట్రిట్ డైటో ఫాలో అవుదాం అనుకున్నరోజే.. ఫ్రెండ్ గాడు బిర్యానీకి పిలుస్తాడు లేదా.. ఇంట్లో అమ్మ మనకు ఇష్టమైన వంట చేసేస్తుంది. కాంప్రమైజ్ కాలేక.. లాగించేస్తాం. పాపం చాలామంది విషయంలో ఇదే జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో.. వీటిని సైడ్ చేయకుండా.. బరువును ట్రాక్ తప్పించేయొచ్చు. కేవలం ఈ రెండు వ్యాయామాలు చేయండి. టైం కూడా పెద్దగా పట్టదు. కానీ రిజల్ట్ మాత్రం గట్టిగా వస్తుంది. ఇంట్లోనే సులభంగా పుష్ అప్స్, స్క్వాట్‌లు చేస్తూ అలా అలా.. ఈజీగా బరువు తగ్గేయొచ్చు.
పుష్ అప్స్ వల్ల ఉపయోగాలు..
ఇంట్లోనే పుష్ అప్స్ చేయడం వల్ల శరీర పైభాగం బలాన్ని పొందుతుంది.
ఇది కండరాలను, శరీరాన్ని బలంగా చేస్తుంది.
 పుష్ అప్స్ చేయడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది.
బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. తద్వారా పొట్ట కరుగుతుంది. మనకు మేయిన్ ప్రాబ్లమ్ ఇదే కదా..
స్క్వాట్స్ వల్ల ఉపయోగాలు..
స్క్వాట్‌లు చేయడం వల్ల దిగువ శరీరం బలపడుతుంది.
స్క్వాట్‌లు చేయడం ద్వారా మనస్సు పని చేసే సామర్థ్యం పెరుగుతుంది.
తొడభాగంలో కొవ్వు కరుగుతుంది.
ఏ సమయంలో స్క్వాట్స్, పుష్ అప్ వ్యాయామాలు చేయాలంటే..
జనరల్గా ఏ వ్యాయామం అయినా మార్నింగ్ టైమ్స్ లో చేస్తేనే.. ఆ డే అంతా ఫ్రష్ గా ఉండొచ్చు. పుష్ అప్స్, స్క్వాట్స్ కూడా ఉదయం మాత్రమే చేయాలి. ఉదయాన్నే ఇలా చేయడం వల్ల శరీరంపై ప్రభావం కూడా కనిపిస్తుంది. సోమరితనం తగ్గుతుంది. రోజంతా శక్తివంతంగా ఉంటారు. ఒత్తిడి సమస్యను కూడా దూరం చేస్తుంది.
స్టాటింగ్ లో ఎన్ని పుష్ అప్స్, స్క్వాట్స్ చేయాలి?
ఇక రేపటని నుంచి స్టాట్ చేద్దాం అనుకుంటున్నారా.. అయితే.. ప్రారంభంలో కనీసం 40 పుష్ అప్లు చేయాడానకి ట్రై చేయండి. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ చేయండి.. ఇక స్క్వాట్‌లు కూడా.. దాదాపు 3 సెట్లు.. సెట్ కు 20 చొప్పున 60 చేయాలి. ఈ రెండింటి వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఒక వారం తర్వాత నెంబర్ పెంచుకుంటూ పోవచ్చు. రిజల్ట్ మీకే తెలుస్తుంది. మంచి సాంగ్స్ పెట్టుకుని ఈ రెండు వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి మరీ..!
– Triveni baskarowthu

Read more RELATED
Recommended to you

Latest news