ఈ రోజు ఈ రాశివాళ్ళు శుభవార్తలు వింటారు..

జూలై 26 మంగళవారం రాశి ఫలాలు..ఏ రాశివారికి ఎలా ఉంటుందో చుద్దాము..

మేషం: బాకీలు అనూహ్యంగా వసూలవుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.కొన్ని ముఖ్యమైన పనులలో ఆటంకాలు..

వృషభం: పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.కుటుంబ సభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం..

మిథునం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. సోదరుల ద్వారా ధనప్రాప్తి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు వచ్చే సూచనలు.ఆకస్మిక ప్రయాణాలు..వాహన యోగం.. శుభవార్తలు వింటారు..

కర్కాటకం: ప్రయాణాలలో మార్పులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు.

సింహం: ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.సన్నిహితులు, సోదరులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం.దైవదర్శనాలు.

కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం. ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి.

తుల: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ప్రయాణాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సర్దుబాటు వైఖరి అనుసరిస్తారు.

వృశ్చికం: శ్రమ కొంత పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

ధనుస్సు: శుభవార్తలు. వాహనాలు కొంటారు. సోదరులతో ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.ఈరోజు కొన్ని కీలక విషయాలు పూర్తి అవుతాయి.

మకరం: ప్రముఖుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.సన్నిహితులు, సోదరులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం.

కుంభం: శ్రమాధిక్యంతో పనులు పూర్తి. కుటుంబంలో సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ధనవ్యయం.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. బంధువుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.