జూన్ 5 ఆదివారం రాశి ఫలాలు..

-

జూన్ 5 ఆదివారం ఏ రాసి వారికి మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..

మేషం

బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే తగాదాలు వచ్చే అవకాశం ఉంది. చేసే పనులలో ఇబ్బందులు ఉండవు. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు..ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు..

వృషభం

అనుకోని రీతిలో కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభాలు వస్తాయి.

మిథునం

ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించక తప్పదు.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

కర్కాటకం

నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి..దూర ప్రయాణాలు చేస్తారు.

సింహం

కొత్త వ్యక్తులతో పరిచయాలు అంత మంచివి కావు . సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడుతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.బంధువులతో గొడవలు..

కన్య

స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఆలోచన అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభత్రకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు..ఈరోజు అంత మంచి రోజు కాదు.

తుల

కొత్త రుణ లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది..సమాజంలో కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.

వృశ్చికం

భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది.మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించరాదు..ఈరోజు ఆలొచాల్సిన విషయం..

ధనుస్సు

కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు..దూర ప్రయాణాలు లాభిస్తాయి..కొంత ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి..

మకరం

శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు..కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది..

కుంభం

తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం..ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ద అవసరం..

మీనం

ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మంచి రోజు..

Read more RELATED
Recommended to you

Latest news