ముగ్గురు అమ్మాయిలు.. నదిలో మునిగి పోతున్న 22 మందిని కాపాడారు

-

ముగ్గురు అమ్మాయిలు.. స్కూల్ కు వెళ్లే అమ్మాయిలు.. తమ ప్రాణాలకు తెగించి 22 మంది ప్రాణాలను కాపాడి శెభాష్ అనిపించుకుంటున్నారు.

జనవరి 2, 2019. ఒడిశాలోని మహానదిలో ప్యాసెంజర్ బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఆసమయంలో బోటులో 55 మందికి పైగా ప్యాసెంజర్లు ఉన్నారు. ప్యాసెంజర్లంతా నీళ్లలో పడిపోయారు. ఆ నదిలో మొసళ్లు కూడడా ఉంటాయి. ఈత రానివాళ్లు మునిగిపోతున్నారు. అప్పటికే 10 మంది చనిపోయారు. మిగితా వాళ్లు మునిగిపోతున్నారు. అప్పుడే బయట ఉన్న ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు, పడవలో ఉన్న ఓ యువతి… దైర్యం చేశారు.

సుభస్మిత అనే యువతి కూడా మిగితా ప్యాసెంజర్లలాగానే బోటు కింద పడిపోయింది. కానీ.. బోటు కింది నుంచి తప్పించుకొని ఎలాగొలా ఒడ్డుకు చేరుకున్నది. అయితే.. బోటు కింద పడి మునిగిపోతున్న పిల్లలను చూసిన సుభస్మిత మళ్లీ నీళ్లలోకి వెళ్లి వాళ్లను ఒడ్డుకు లాక్కొచ్చింది. అలా 12 మంది పిల్లలను సుభస్మిత కాపాడగలిగింది.

అలాగే.. సస్మిత, పూర్ణిమ అనే ఇద్దరు టీనేజీ సిస్టర్స్… అరుపులు విన్నారు. నది వద్దకు వచ్చారు. మునిగిపోయిన బోటును చూసి వెంటనే నీళ్లలోకి దూకి అక్కడికి వెళ్లి దాదాపు 10 మందిని కాపాడారు. అందులో ఇద్దరు మహిళలు, కొందరు చిన్నారులు కూడా ఉన్నారు. కాకపోతే.. అందరినీ కాపాడలేకపోయామనే బాధ మాత్రం వాళ్లలో మిగిలిపోయింది. తమ శక్తి మేరకు కొందరినే కాపాడగలిగారు. మిగితా వాళ్లు మునిగిపోతుంటే చూడటం తప్పితే ఏం చేయలేకపోయారు.

అలా… ముగ్గురు అమ్మాయిలు కలిసి 22 మందిని దాకా కాపాడారు. వీళ్ల సాహసాన్ని గుర్తించిన ఒడిశా ప్రభుత్వం.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను సన్మానించింది. 12 మంది చిన్నారులను కాపాడిన సుభస్మితను కూడా త్వరలోనే సత్కరించనున్నారు. ముగ్గురు అమ్మాయిలను సాహస అవార్డుకు ప్రతిపాదించాలని స్థానికులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news