మీ జీవితంలో మార్పు రావాలని అనుకుంటున్నారా? ఐతే ఇది ఫాలో అవ్వండి..

-

మీరు అనుకుంటున్నట్టు కాకుండా వేరేలా బతుకుతున్నారా? ఎప్పటి నుండో మీకు నచ్చినట్టు ఉండాలనుకున్నా ఉండలేకపోతున్నారా? ప్రోడక్టివిటీ తగ్గిపోతుందా? లేదా ప్రోడక్టివిటీ పెరగడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఐతే ఇది మీకోసమే. జీవితాల్లో మార్పు రావడమనేది చిన్న విషయం కాదు. అసలు మార్పు కనిపించడం చాలా కష్టం. చాలా మంది ఎంత మారదామని ప్రయత్నించినా మారకపోవడానికి చాలా కారణాలుంటాయి. ఐతే మార్పు రావాలనుకునే వాళ్ళు ఏం చేయాలో తెలుసుకుందాం.

ముందుగా మీ రోజుని ప్లాన్ చేసుకోండి. ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నారో నిన్న రాత్రి పడుకునే ముందు ఆలోచించండి. దానివల్ల రేపేం చేయాలో మీకంటూ క్లారిటీ వస్తుంది. కాబట్టి టైమ్ మేనేజ్ మెంట్ ఈజీ అవుతుంది.

ఈ రోజులో ఏం చేస్తున్నారో దాన్ని ఆనందించండి. ఆనందించకుండా ఏది చేసినా కష్టంగానే ఉంటుంది. భవిష్యత్తు అనేది మన చేతుల్లో లేదు. రేపేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే చేస్తున్న పనిలో ఆనందం వెతుక్కోవాలి. లేకపోతే మీకు ఆనందాన్నిచ్చే పని చేయాలి.

చిన్న చిన్న సంతోషాలని సెలెబ్రేట్ చేసుకోండి. అది మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ రోజు చేస్తున్న పని ఉత్సాహాన్ని అందిస్తే రేపింకా బాగా చేయగలుగుతారు.

మీ శరీరానికి పని కల్పించండి. ఎప్పుడూ చురుగ్గా ఉండేవారి ఆలోచనలు చురుగ్గా ఉంటాయి. శరీరం పనిచేసి అలసిపోతే మెదడు బాగా పనిచేస్తుంది. శరీరానికి వ్యాయామాన్ని ఇవ్వండీ.

మీ ఎమోషన్స్ ని కంట్రోల్ లో ఉంచుకోండి. ప్రతీ దానికి బరస్ట్ అయితే ఇబ్బందులు తప్పవు. ఎమోషన్స్ ని కంట్రోల్ లో ఉంచుకున్నవాళ్ళే గెలుస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news