అడ్డంకులని ఎదుర్కుంటే అవకాశాలు అవే వస్తాయి.. ఈ కథ చదవండి.

-

జీవితమనే దారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు వాటిని దాటుకుంటూ వెళ్తే కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తుంటాయి. అడ్డంకి ఎదురైందని అక్కడే నిలబడిపోతే ఆ అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్ళమవుతాం. అసలు అడ్డంకులు ఎదురయ్యేది మనల్ని పరీక్షించడానికే, ఒక పని చేస్తున్నప్పుడు సాఫీగా సాగిపోతే అందులో కిక్ ఏం ఉంటుంది. కష్టాలు రావాలి. వాటిని దాటుతుంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అలాంటప్పుడు జీవితంలో మళ్ళీ ఏ కష్టం ఎదురైనా ఇబ్బంది పడకుండా ఉంటుంది.

అడ్డంకులు ఎదుర్కొంటే అవకాశాలు ఎలా ఎదురొస్తాయనే విషయమై డేర్ టు డూ యూట్యూబ్ ఛానల్ వారు ఓ కథని పోస్ట్ చేసారు.

ఒకానొక రాజ్యంలో రాజుగారికి ఒక ఆలోచన వస్తుంది. దాన్ని వెంటనే అమలు చేయాలన్న ఉద్దేశ్యంలో మంత్రిని పిలిచి తన ఆలోచనని చెప్పాడు. సరే అని చెప్పిన మంత్రి మరుసటి రోజు, రాజభవనానికి వచ్చే మార్గ మధ్యంలో ఒక పెద్ద బండరాయిని పెట్టించాడు. రోడ్డుకి అడ్డంగా ఉన్న ఆ బండరాయిని చూసిన జనాలు ఇంతటి పెద్ద బండరాయి మార్గ మధ్యలోకి ఎలా వచ్చిందని ఆలోచించసాగారు. ప్రతీ ఒక్కరూ అలా ఆలోచిస్తున్నారు తప్ప దాన్ని తీసివేయడానికి ముందుకు రావట్లేదు. ఇలా రోడ్డు మధ్యలో బండరాయి ఉన్నా రాజు ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో అందరూ రాజుని లోలోపలే తిట్టుకోసాగారు.

మూడు రోజుల పాటు ఆ బండరాయి అక్కడే ఉంది. నాలుగవ రోజు ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి అటు వైపుగా వచ్చాడు. రోడ్డు మధ్యలో ఉన్న బండరాయిని చూసాడు. దాన్ని పక్కకి తీద్దామన్న ఉద్దేశ్యంతో కర్ర సాయం తీసుకుని దాన్ని రోడ్డు పక్కకి తప్పించాడు. అప్పుడు ఆ బండరాయి ఉన్న స్థానంలో ఒక చిన్న ప్యాకెట్ కనిపించింది. అది చేతుల్లోకి తీసుకున్న కూరగాయలమ్మే వ్యక్తి విప్పి చూసాడు. దాన్లో బంగారు నాణేలతో పాటు ఒక చిన్న ఉత్తరం కనిపించింది. ఆ ఉత్తరంలో ఇలా ఉంది. ఎవరైతే బండరాయిని తీసి మార్గాన్ని క్లియర్ చేస్తారో వారికి ఈ బంగారు నాణేలు ఇవ్వబడతాయి అని.

అది చదివిన కూరగాయలమ్మే వ్యక్తి సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఇదండీ కథ.

Read more RELATED
Recommended to you

Latest news