కొందరెందుకు ఎంత మాట్లాడినా వినాలని అనిపిస్తుంది? కొందరెందుకు అంత త్వరగా ఆకర్షిస్తారు? అసలు ఎదుటి వారిని మాటల్లో పెట్టి ఆకర్షించడానికి ఎలాంటి టెక్నిక్స్ కావాలో ఇక్కడ తెలుసుకుందాం.
హాయిగా నవ్వండి
ప్రశాంతంగా నవ్వడం అనేది అందరూ చేయరు. హాయిగా నవ్వుతున్న వారివైపు అందరూ చూస్తారు. మీలోపల ఎన్ని బాధలున్నా పైకి మాత్రం నవ్వుతూ ఉండాలి. ఈ రోజు బాధలన్నీ రేపు సంతోషాలుగా మారతాయని మీకు తెలుసు. అందుకే నవ్వండి. నవ్వుతూ జీవిస్తున్న వారివైపు ఉండడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు.
మర్యాద
అవతలి వారిని పలకరించేటపుడు మర్యాదపూర్వకంగా ఉండాలి. అలాంటపుడే మీరు చెప్పేది వినడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు.
నిష్కల్మషమైన మనస్సు
మనస్సులో ఎలాంటి భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా ఉంటే మీతో స్నేహం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకే మనసుని నిర్మలంగా ఉంచుకోవాలి. పగలు, ప్రతీకారాలు అని చెప్పి చిన్న చిన్న విషయాలకే జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసుకోవద్దు.
ఎదిరింపు
అన్యాయం జరుగుతుందని తెలిసినపుడు కూడా నోర్మూసుకుని కూర్చోవడం కరెక్ట్ కాదు. నాయకుడిగా ఎదగాలంటే అన్యాయాన్ని ఎదిరించాలి. అలాంటివారి పట్లే ఎవ్వరైనా ఆకర్షితులవుతారు.
క్రియేటివిటీ
మీరు చేసే పనిలో క్రియేటివిటీ ఉంటే చాలా తొందరగా కనెక్ట్ అవుతారు. గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే కిక్కు ఉండదు.
ఒప్పుకోలు
అవతలి వారు చెప్పింది తప్పని, తాము చెప్పిందే ఒప్పని వాదించే వారిని ఎవరూ ఇష్టపడరు. అవతలి వారికి గౌరవం ఇచ్చి, తాము చెప్పేదాన్లో తర్కాన్ని చూసి ఒప్పుకుంటే మీరు ఎదుటివారిని ఆకర్షించవద్దు.
ఈ విషయాలు మీలో డెవలప్ చేసుకుంటే మీరు అవతలి వారిని ఆకర్షించగలరు.