చదువుతున్నప్పుడు మనసు పాడవకుండా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు..

పుస్తకం ముందు పెట్టుకుంటే చాలు ఎక్కడ లేని ఆలోచనలు చుట్టుముట్టేస్తుంటాయి. అప్పటి వరకూ గుర్తు రాని ఆలోచనలు కూడా పుస్తకం ముందు పెట్టుకోగానే ముసురుకుంటాయి. అందులో చాలా వరకు అనవసరమైన ఆలోచనలే. ఐతే అలాంటి ఆలోచనలు రాకుండా కేవలం చదువు మీదే దృష్టి పెట్టడానికి పాటించాల్సిన చిట్కాలు తెలుసుకుందాం.

మనకి రోజూ లక్ష ఆలోచనలు వస్తుంటాయి. కానీ చదువు మీద కూర్చున్నప్పుడు ఆ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టెయ్యాలి. అలా చేయడం కష్టమే కావచ్చు. కానీ అసాధ్యం కాదు. మీకు వస్తున్న ఆలోచనల్లో ఏవేవి ముఖ్యం అనుకుంటున్నారో వాటన్నింటినీ ఒక పేపర్ మీద రాసుకోండి. అలా రాసిన వైపు ఒకసారి చూసి చదివిన తర్వాత వాటి గురించి ఆలోచిద్దాం అని మనసులో అనుకోండి.

అంతే, ఆల్రెడీ ఆ ఆలోచనల గురంచి ఆలోచించడానికి టైమ్ కేటాయించారు కాబట్టి ఇక వదిలేయండి. ఇంకా, మొబైల్ ఫోన్, ఐపాడ్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ని దూరంగా ఉంచండి. తరచుగా వచ్చే కాల్స్ మిమ్మల్ని చదుదు మీద నుండి ఆసక్తిని తగ్గిస్తాయి.

చదవాలనుకునే వారు టైమ్ టేబుల్ క్రియేట్ చేసుకోవడం కంపల్సరీ. అలాగే ఒకరోజులో ఒకే సబ్జెక్టు చదవద్దు. రోజులో ఎక్కువ భాగం ఒకే సబ్జెక్టు చదవడం వల్ల బోర్ ఫీలింగ్ కలుగుతుంది. అందుకే సబ్జెక్టును మారుస్తూ ఉంటే కొత్త ఎనర్జీ వస్తుంది.

రోజుకి 7నుండి 8గంటలు నిద్రపోవడం మర్చిపోవద్దు. ఎక్కువ సేపు చదవాలన్న ఉద్దేశ్యంతో నిద్రని దూరం చేసుకోవడం సరికాదు. సరైన నిద్ర, సరైన తిండి ఉంటేనే సరిగ్గా చదవగలరు. రోజులో కనీసం 15-30 నిమిషాలైనా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.