రూ.100 కే సోలార్ కుక్కర్.. ఎవరైనా తయారు చేయొచ్చు.. యువ ఇంజినీర్ నయా ఆవిష్కరణ..!

-

ప్రస్తుతం గుజరాత్ లోని రిమోట్ గ్రామాల్లోని వందలాది మంది గిరిజనులు ఈ సోలార్ కుక్కర్ ను ఉపయోగించి వంట చేసుకుంటున్నారు. దీని కోసం వేలకు వేలు డబ్బు పోయాల్సిన అవసరం లేదు. వంట కోసం చెట్లను నరకాల్సిన పని లేదు. లేదా… గ్యాస్ తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ సోలార్ కుక్కర్ ఒకటి ఉంటే చాలు.

ఉదయం 9 కావొస్తోంది… పొలానికి వెళ్లే ముందు ఓ మహిళ వంట వండటం కోసం ఒక కప్పు పప్పును తీసుకొని… దాంట్లో కట్ చేసిన కూరగాయలు వేసి వాటిని కుక్కర్ లో వేసింది.

అలాగే బియ్యాన్ని కూడా అందులో వేసి… దాన్ని అలాగే వదిలేసి పొలానికి వెళ్లిపోయింది. మధ్యాహ్నం సమయంలో తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి వేడి వేడిగా అన్నం వండి ఉంది. తినడానికి సిద్ధంగా ఉంది. అరె… ఇది ఎలా సాధ్యం అయింది అంటారా? అదే సోలార్ కుక్కర్ మహిమ.

ప్రస్తుతం గుజరాత్ లోని రిమోట్ గ్రామాల్లోని వందలాది మంది గిరిజనులు ఈ సోలార్ కుక్కర్ ను ఉపయోగించి వంట చేసుకుంటున్నారు. దీని కోసం వేలకు వేలు డబ్బు పోయాల్సిన అవసరం లేదు. వంట కోసం చెట్లను నరకాల్సిన పని లేదు. లేదా… గ్యాస్ తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ సోలార్ కుక్కర్ ఒకటి ఉంటే చాలు.

ఇంతకీ ఈ సోలార్ కుక్కర్ ను ఎవరు కనిపెట్టారు? అంటే… ఆ క్రెడిట్ గుజరాత్ కు చెందిన అల్జుబెర్ సయ్యద్ కు చెందుతుంది.

సాధారణంగా ప్రెషర్ కుక్కర్ కొనాలంటే వేలకు వేలు ఖర్చు పెట్టాలి. కానీ.. ఈ సోలార్ కుక్కర్ కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం 50 నుంచి 100 రూపాయల వరకు ఖర్చు పెట్టుకోగలిగితే చాలు. ఎవరికి వారే సొంతంగానూ ఈ కుక్కర్ ను తయారు చేసుకోవచ్చు.

నిజానికి… ఇప్పటికీ భారత్ లోని రిమోట్ గ్రామాల్లో ఇంకా కట్టెలతో లేదా గోబర్ గ్యాస్ తో…. రకరకాల వంట సాధనాలతో వంట చేస్తున్నారు. కట్టెల మీద వంట వండటం వల్ల మహిళలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటికి పరిష్కార మార్గం చూపాలన్న ఉద్దేశంతోనే సయ్యద్ సోలార్ కుక్కర్ ను తయారు చేశారు.

సోలార్ కుక్కర్ అనేది మహిళలకు ఒక వరం లాంటిది. దాని వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. కాలుష్యం కాదు. పర్యావరణానికి ఎటువంటి హానీ జరగదు. అందులోనూ పునరుత్పాదక శక్తినే అది ఉపయోగించుకుంటుంది. మొత్తానికి సోలార్ కుక్కర్ అనేది పర్యావరణ హితమైంది.. అంటూ సోలార్ కుక్కర్ విశిష్టతను చెప్పుకొచ్చారు యువ ఇంజినీర్ సయ్యద్.

సోలార్ కుక్కర్ క్యాంపెయిన్

సోలార్ కుక్కర్ ను తయారు చేశాక గుజరాత్ లోని పలు గిరిజన గ్రామాల్లో పర్యటించి సోలార్ కుక్కర్ విశిష్టతను అందరికీ తెలియజేశారు సయ్యద్. 2016 అక్టోబర్ లో సోలార్ కుక్కర్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఎండను ఎలా ఉపయోగించుకొని సోలార్ కుక్కర్ ద్వారా వంట చేసుకోవచ్చే గ్రామాల్లోని మహిళలకు వివరించారు. ఇప్పటి వరకు గుజరాత్ లోని పంచ్ మహల్, నర్మదా, జామ్ నగర్, జెట్ పూర్ లాంటి ప్రాంతాల్లో 100 గ్రామాల్లో సయ్యద్ పర్యటించి అక్కడి ప్రజలకు సోలార్ కుక్కర్ గురించి తెలియజేశారు.

దీంతో చాలామంది మహిళలు సోలార్ కుక్కర్ తో వంట వండుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం చాలామంది మహిళలు సోలార్ కుక్కర్ ద్వారానే వంట చేసుకుంటున్నారు.

సోలార్ కుక్కర్ ను ఎవరైనా తయారు చేసుకోవచ్చు

సోలార్ కుక్కర్ ను ఎవరైనా తయారు చేసుకోవచ్చు. కార్డ్ బోర్డ్, అల్యూమినియం రేకు, బట్టలకు పెట్టే పిన్, ఐడీ కార్డు కోసం వాడే దారం లాంటిది ఉంటే చాలు. ఒక గిన్నె(అల్యూమినియం లేదా స్టీల్) ను తీసుకొని… దాని బయట బ్లాక్ కలర్ పెయింట్ వేయాలి. ఎండ వేడిని ఎక్కువగా గ్రహించడం కోసం బ్లాక్ కలర్ పెయింట్ వేయాలి. అంతే… అల్యూమినియం రేకులో గిన్నెను పెట్టి… దాన్ని ఎండకు పెట్టి.. మనకు కావాల్సిన వంటకాలను వండుకోవడమే. దీన్ని తయారు చేయడానికి 100 రూపాయల వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. దాని తయారీకి కావాల్సిన వస్తువులన్నీ ప్రతి ఇంట్లో ఉండేవే. సోలార్ కుక్కర్ ద్వారా పప్పు, అన్నం, కూర, డోక్లా, హండ్వా, కేక్ లాంటివి వండుకోవచ్చు.

5 నుంచి ఆరుగురు వ్యక్తులు ఉండే ఫ్యామిలీకి 2 నుంచి 3 గంటల్లో వంట వండేయొచ్చు. ఒకసారి దీన్ని తయారు చేసుకుంటే…. కనీసం సంవత్సరంనర వరకు వాడుకోవచ్చు. దీన్ని ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు. పిల్లలు కూడా ఈజీగా సోలార్ కుక్కర్ లో వంట వండేయొచ్చు.

గిరిజన మహిళల కోసం పర్యావరణ హితమైన సోలార్ కుక్కర్ ను తయారు చేసినందుకు…. సయ్యద్ కు 2018 లో ఇంటర్నేషనల్ వాలంటీర్ డే రోజున యూఎన్ వీ అవార్డు 2018 దక్కింది. అలాగే… గాంధీ గ్లోబల్ సోలార్ జర్నీ సెంటర్ లో సోలార్ ఏంజెల్ గా సయ్యద్ ఎంపికయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news