స్ఫూర్తి : కోటి రూపాయల ఉద్యోగాన్ని వదిలేసి.. లక్ష రూపాయిల వ్యాపారం.. సక్సెస్ అంటే ఇది కదా..!

-

కొంతమంది ఆలోచనలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి సాధారణ ఉద్యోగం కాదని కొన్ని చాలా మంది వారి యొక్క ఐడియా తో ప్రణాళిక వేసుకుని.. ముందుకు వెళ్లిపోతుంటారు అందుకోసం దేనినైనా కూడా వదలకుంటారు. ఈ యువతి కూడా అంతే. ఈమె ఏకంగా కోటి రూపాయల ప్యాకేజీ తో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకుని ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసింది ఈమె నిర్ణయాన్ని చూసి మొదట అందరూ షాక్ అయిపోయారు.

Aarushi Agarwal
Aarushi Agarwal

 

అదేంటి అంత ఎక్కువ డబ్బులు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకుంది అని.. కానీ తర్వాత ఈమె సక్సెస్ ని చూసి అందరూ అభినందిస్తున్నారు. ఈమె పేరు ఆరుషి అగర్వాల్. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది ఈమె. ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ లో ఈమె పుట్టింది. ఈమె బీటెక్ చేసింది. ఐఐటీ ఢిల్లీ లో ప్రోగ్రాం కి ఎంపిక అయింది కూడా.

కోటి రూపాయల ప్యాకేజీ తో జాబ్ వచ్చింది అయినా కూడా వదులుకొని లక్ష రూపాయలతో టాలెంట్ డీక్రిప్టు ని స్టార్ట్ చేసింది ఈ ప్లాట్ఫారం ద్వారా కోడింగ్ చేసే వాళ్ళు వాళ్ళ స్కిల్స్ ని పరిశీలించుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ సహాయంతో పది లక్షలకి మందికి పైగా ఉద్యోగాలు పొందారు కేవలం మూడేళ్లలోనే ఈ సంస్థ టర్న్ ఓవర్ 50 కోట్ల రూపాయలకు చేరింది. ఇది కదా సక్సెస్ అని ప్రతి ఒక్కరు కూడా ఆమెని అభినందిస్తున్నారు. ఈమెని ఆదర్శంగా తీసుకుంటే మీరు కూడా మంచిగా సక్సెస్ ని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news