పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నాయో తెలిసిందే. ఒకవైపు వాలంటీర్లు మరో వైపు జనసేన కార్యకర్తలు గందరగోళంగా వాదోపవాదనలు చేసుకునో రాష్ట్రాన్ని నవ్వులపాలు చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. సీఎం జగన్ తీసుకు వచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా పోయిందని ప్రభుత్వాన్ని నిందించారు. ప్రజల కోసమే వాలంటీర్లు ఉంటే రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండి పనిచేయాలని రవీంద్ర సూచించారు. వాలంటీర్లు అమాయకంగా సీఎం జగన్ చేతుల్లో ఇరుక్కున్నారని విమర్శించారు మాజీ మంత్రి. సీఎం జగన్ ను నమ్ముకుని వాలంటీర్ గా అతి తక్కువ జీతానికి పనిచేయడానికి రావడం వలన ఇప్పుడు రాష్ట్రము అంతా వారినే నిందించే స్థాయికి సమస్య పెరిగిపోయింది అంటూ రవీంద్ర మాట్లాడారు.
కాగా ముందు ముందు ఈ సమస్య ఇంకెన్ని ఇబ్బందులను తెస్తుందో చూడాలి. వైసీపీ ఈయన వ్యాఖ్యలపై ఏమైనా కౌంటర్ ఇస్తుందా చూడాలి.