కోవిడ్ బాధితుల‌ను ఆటోలో ఉచితంగా త‌ర‌లిస్తున్న వ్య‌క్తి.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

-

క‌రోనా సెకండ్ వేవ్ దేశాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. ఎంతో మందిని త‌మ ఆత్మీయుల‌కు దూరం చేస్తోంది. అనేక చోట్ల కోవిడ్ బాధితుల‌కు స‌హాయం కూడా స‌రిగ్గా అంద‌డం లేదు. ఈ క్ర‌మంలోనే అలాంటి వారికి చేయూత‌ను అందించేందుకు ఎంతో మంది ముందుకు వ‌స్తున్నారు. ఇక ముంబైకి చెందిన ఆ ఉపాధ్యాయుడు కూడా త‌న‌కు తోచినంత స‌హాయం చేస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతున్నాడు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

man transports covid patients in his auto for free

ముంబైలోని ఘ‌ట్కోప‌ర్‌లో నివాసం ఉండే ద‌త్తాత్రేయ సావంత్ అనే వ్య‌క్తి స్థానికంగా ఉన్న ధ్యాన్‌సాగ‌ర్ విద్యామందిర్ స్కూల్‌లో ఇంగ్లిష్ టీచ‌ర్‌గా ప‌నిచేస్తూనే పార్ట్ టైమ్‌గా ఆటోను న‌డుపుతూ జీవ‌నం సాగిస్తున్నాడు. అయితే కోవిడ్ బాధితులు హాస్పిట‌ల్స్‌కు వెళ్లేందుకు, డిశ్చార్జి అయ్యాక తిరిగి ఇంటికి వ‌చ్చేందుకు ఆంబులెన్స్ స‌దుపాయం అందుబాటులో ఉండ‌డం లేదు. దీంతో సావంత్ త‌న ఆటోను చిన్న‌పాటి ఆంబులెన్స్‌గా మార్చాడు. కోవిడ్ బాధితుల‌ను ఉచితంగా హాస్పిట‌ల్స్ కు త‌ర‌లిస్తూ త‌న వంతు స‌హాయం చేస్తున్నాడు.

సావంత్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఆటోను శానిటైజ్ చేస్తాడు. అలాగే కోవిడ్ బాధితుల‌ను త‌ర‌లించే స‌మ‌యంలో పీపీఈ కిట్ ధ‌రిస్తాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను చేస్తున్న సేవ‌ను అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ సావంత్‌కు చెందిన విష‌యాన్ని ట్విట్ట‌ర్ పోస్టు చేయ‌గా అత‌నికి స‌హాయం అందించేందుకు చాలా మంది ముందుకు వ‌స్తున్నారు. ముంబై క్రికెట్ అసోసియేష‌న్ అత‌నికి స‌హాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇక ఆ రాష్ట్ర కార్పొరేట్ అఫెయిర్స్ మంత్రిత్వ శాఖ సావంత్ ఆటోకు అయ్యే ఇంధ‌న ఖ‌ర్చుల‌ను భరిస్తామ‌ని హామీ ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే నెటిజ‌న్లు కూడా సావంత్ చేస్తున్న సేవ‌కు అత‌న్ని అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news