కేవ‌లం ఒక్క కాలుతోనే ఫుట్‌బాల్ ఆడుతున్న బాలుడు.. నెటిజ‌న్ల అభినంద‌న‌..

-

అన్ని అవ‌రోధాలు ఎదురైనా, ఎంత క‌ష్ట‌మొచ్చినా.. అన్నింటినీ త‌ట్టుకుని నిల‌బ‌డాలి. బ‌ల‌హీన‌త‌ల‌ను అధిగ‌మిస్తూ ఉన్న‌త ల‌క్ష్యాల దిశ‌గా ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగాలి. అప్పుడే జీవితంలో ఉన్న‌త శిఖ‌రాల‌ను సాధించ‌గ‌లుగుతారు. స‌రిగ్గా ఇలా అనుకున్నాడు కాబ‌ట్టే ఆ బాలుడు త‌న‌కు ఒక కాలు లేక‌పోయినా ఉన్న ఒక్క కాలుతో ఫుట్‌బాల్ ఆడుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాడు. ఇలాగే ముందుకు సాగి భ‌విష్య‌త్తులో ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తాన‌ని ధీమాగా చెబుతున్నాడు. అత‌నే మ‌ణిపూర్‌కు చెందిన కునాల్ శ్రేష్ట‌.

manipur boy playing foot ball with one leg netizen applaud

మ‌ణిపూర్‌లోన ఇంఫాల్‌కు చెందిన కునాల్ శ్రేష్ట 4వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. వ‌య‌స్సు 9 సంవ‌త్స‌రాలు. పుట్టుక‌తోనే అత‌నికి కుడి కాలు లేదు. కేవ‌లం ఎడ‌మ కాలుతోనే నిత్యం అన్ని ప‌నులు చేసుకునేవాడు. అయితే ఆ కాలుతోనే అత‌ను ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఇప్పుడు ఆ ఆట‌ను బాగా ఆడుతున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌ని వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

కునాల్ శ్రేష్ట కేవ‌లం ఒక్క కాలుతోనే ఫుట్‌బాల్ ఆడుతుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. నెటిజన్లు అత‌న్ని ప్ర‌శంసిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అత‌ను మీడియాతో మాట్లాడుతూ.. నాకు ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టం. ప్రారంభంలో బ్యాలెన్స్ చేసుకునేందుకు నాకు చాలా స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. నాకు భ‌యం వేసింది. కానీ నెమ్మ‌దిగా నాకు కాన్ఫిడెన్స్ వ‌చ్చింది. నా స్నేహితులు నాకు ఎంతో స‌పోర్ట్‌ను ఇచ్చారు. నేను ఏదో ఒక రోజు ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకుంటాన‌నే న‌మ్మ‌కం నాకుంది.. అని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news