స్త్రీల ఆరోగ్యం కోసం మానుషి చిల్లార్ అద్భుతమైన కార్యక్రమం…!

-

మిస్ వరల్డ్ 2017, మానుషి చిల్లార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యంలో స్త్రీల పారిశుధ్యం గురించి అవగాహన కల్పించడానికి గానూ ముందుకు వచ్చింది ఆమె. లాక్ డౌన్ లో పేదలు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో అందరికి తెలిసిందే. తినడానికి తిండి లేక వాళ్ళు పడే అవస్థలు మరీ దారుణం. మన దేశంలో జనాభా ఎక్కువ. కాబట్టి ప్రభుత్వాలు ఎంత సాయం చేసినా సరే పేదలకు అందేది కొంచమే.

ఆహారమే దొరకక ఇబ్బంది పడుతున్న సమయంలో శానిటరీ న్యాప్‌కిన్‌ల కోసం ఖర్చు చేసే అంత సామర్ధ్యం ఉండదు అని భావించింది ఆమె. ప్రభుత్వాలు వారి రేషన్లతో శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేయాలని కోరారు. నేను ప్రాజెక్ట్ శక్తిని ప్రారంభించానని ఆమె చెప్పుకొచ్చింది. దీని ద్వారా వ్యక్తిగత పరిశుభ్రత గురించి మహిళలకు అవగాహన కల్పించానని ఆమె వివరించింది. ఇది నాకు నిజంగా మంచి అనుభవాన్ని ఇచ్చింది అని ఆమె వివరించింది. ప్రాజెక్ట్ శక్తి అనేది లాభాపేక్షలేని కార్యక్రమమని ఆమె చెప్పుకొచ్చింది.

ఇది స్త్రీల పారిశుధ్యం గురించి అవగాహన పెంచడానికి మరియు స్థానికులతో కలిసి బయోడిగ్రేడబుల్ ప్యాడ్లను తయారు చేయడానికి శ్రీకారం చుట్టింది అని ఆమె వివరించిది. శానిటరీ న్యాప్‌కిన్‌లను అత్యవసర వస్తువుగా చేర్చాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చిల్లర్ అభినందినందించింది. నిధుల కొరత కారణంగా ఆదాయం తక్కువగా ఉండే మహిళలు ప్రమాదంలో ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు. శానిటరీ న్యాప్‌కిన్‌లను తక్కువ వయస్సు గల మహిళలకు ఉచితంగా అందించాలని ఆమె భావిస్తుంది. ది.

Read more RELATED
Recommended to you

Latest news