ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ కోసం పలు మినహాయింపు లు ఇచ్చింది. పలు కీలక నిర్ణయాలను తీసుకుంటూ ప్రజల సౌకర్యం మేరకు నిర్ణయాలు వెల్లడించింది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని భావించిన జగన్ సర్కార్… కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్‌లో ఇచ్చిన సూచనల ఆధారంగా ప్రభుత్వం కొత్తగా గైడ్ లైన్స్ జారీ చేసింది.
వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పనులకు మినహాయింపు
ప్లాంటేషన్ పనులు, కోతలు, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ మినహాయింపు
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు, టెలికం కేబుల్స్ వేసుకోవడానికి అనుమతి
షరతులతో ఈ కామర్స్, ఈ కామర్స్ వాహనాలకు పర్మిషన్
వలస కార్మికులు రాష్ట్రంలో సొంత గ్రామాలకు వెళ్లేందుకు అనుమతి
బుక్ షాపులకు అనుమతి
ఓడలకు ప్రత్యేక ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్)
గ్రామీణ ప్రాంతాల్లో మాల్స్, మార్కెటింగ్ కాంప్లెక్స్ తెరవడానికి అనుమతి
కల్తు గీత కార్మికులకు సడలింపులు