ఓర్నీ తాత.. ఈ వయస్సులో స్టంట్స్ తో పిచ్చెక్కించేస్తున్నావుగా.. వీడియో వైరల్..

-

కుర్రాళ్లకు బైకు అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. చేతిలో బైకు ఉంటే చాలు వాళ్ళు చేసే విన్యాసాలు మాములుగా ఉండవు..వాళ్లను ఆపడం చాలా కష్టం కూడా. బైక్‌పై వేగంగా దూసుకెళుతూ.. ‘సాహసమే శ్వాసగా’ సాగిపోతారు. చాలామంది కుర్రాళ్లు బైక్‌పై స్టంట్స్ చేస్తుంటారు. కుర్రాళ్ల స్టంట్స్ వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో మనం చూస్తుంటాం. అయితే ఓ తాత కుర్రాళ్లకు మించి బైక్‌పై స్టంట్స్ చేశాడు. అంతేకాదు డ్యాన్స్‌ కూడా చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది..అంతేకాదు కామెంట్స్ ట్రెండ్ అవుతుంది..

ఆ వీడియోలో ఓ వృద్ధుడు బైక్‌తో రోడ్డుపై స్టంట్స్ చేశాడు. మొదటగా అతను బైక్ హ్యాండిల్‌ని విడిచిపెట్టాడు. ఆపై బైక్‌పై డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తాడు. అంతేకాదు బైక్‌పై జంప్ కూడా చేస్తాడు. అక్కడితో ఆగకుండా వెనకాలకు వంగి చేతులను కూడా ఊపుతాడు. లేచాక రెండు చేతులతో బైక్‌పై డాన్స్ చేస్తాడు. వృద్ధుడు బైక్‌పై ఇన్ని స్టంట్స్ చేసినా కిందపడకపోవడం గమనార్హం. కుర్రాళ్లు కూడా చేయలేని రీతిలో తాత స్టంట్స్ చేశాడు..అందరితో ఈలలు వేయించుకున్నాడు..

బైకుపై తాత చేసిన అద్భుతమైన విన్యాసాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని ‘ajit_navghane_official_07’ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోకి నెట్టింట లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. వారం క్రితమే పోస్ట్ చేసిన ఈ వీడియోకి భారీ స్థాయిలో లైకులు వచ్చాయి. ఇప్పటివరకు దాదాపు 2 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. వీడియో చూసిన అందరూ బైక్‌పై తాత స్టంట్స్ చూసి షాక్ అవుతున్నారు.. ఓర్నీ తాత.. ఈ వయస్సులో స్టంట్స్ తో పిచ్చెక్కించేస్తున్నావుగా.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. ఇక చెప్పడం ఎందుకు ఒకసారి చూస్తే పోలే..

Read more RELATED
Recommended to you

Latest news