అక్కడ జీడిపప్పు కేజీ 30 రూపాయలు మాత్రమే..! ఎగబడి కొంటున్న జనం

-

జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా ఇవన్నీ..రిచ్‌ ఫుడ్స్‌.. వీటిలో పోషకాలు రిచ్‌గానే ఉంటాయి.. వీటి కాస్ట్‌ కాస్ట్‌లీగానే ఉంటుంది. కేజీ కొనాలంటే.. ఇక ఆ ఏరియా, క్వాలిటీని బట్టి.. 1000 రూపాయలు కూడా ఉండొచ్చు. మన దేశంలోనే ఒక ప్రాంతంలో మాత్రం కేవలం కూరగాయల ధరకే జీడిపప్పును అందిస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజమే. కేజీ 30 రూపాయలే..! ఇంతకీ ఎక్కడ అంటారా..?

జీడిపప్పును అత్యంత తక్కువ ధరకే అమ్ముతున్న ఏకైక ప్రదేశం జార్ఖండ్లోని జంతార అనే జిల్లాలో ఉన్న నాలా అనే గ్రామం. దీన్ని ‘జార్ఖండ్ జీడిపప్పు నగరంగా పిలుస్తారు. ఈ గ్రామానికి వెళ్తే మీకు కిలో జీడిపప్పు కేవలం 20 నుంచి 30 రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంది. కూరగాయల కంటే తక్కువే.. చుట్టుపక్కల ప్రాంతాల వారు, నగరాల వారు ఎంతోమంది వచ్చి నాలా గ్రామంలోనే జీడిపప్పును కొని తీసుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచే దళారులు అధికంగా కొన్ని, బయట ప్రాంతాల్లో వంద రెట్లు అధిక ధరకు అమ్ముతారు.

ఎందుకు ఇంత తక్కువ కాస్ట్..

జీడిపప్పును ఇంత తక్కువ ధరకు నాలా గ్రామంలో ఎందుకు విక్రయిస్తున్నారు? ఈ గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో జీడి తోటలనే వేశారు. 2010లో నాలా గ్రామంలోని వాతావరణం, నేలలు జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉంటాయని అటవీ శాఖ గుర్తించింది. అంతేకాదు గ్రామస్తులు అందరికీ ఈ విషయాన్ని చెప్పి జీడి తోటను పెంచే విధంగా చేసింది. అలా ఒకేసారి గ్రామం అంతా పెద్ద ఎత్తున జీడి సాగు మొదలుపెట్టారు. ఇందుకోసం అప్పట్లో ఐఏఎస్ కృపానంద ఝా ఎంతో కష్టపడ్డారు. ఆయన జంతారా జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఈ నాలా గ్రామం విశిష్టతను వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడి అక్కడ నేలలు, నీటిని పరీక్షించేలా చేశారు.

రైతులకు మాత్రం మిగిలింది ఏం లేదు..

అటవీశాఖ చొరవ తీసుకొని ఆ గ్రామంలో జీడి తోటలో పెంచేలా చేశారు. అయితే ఇంతగా జీడిపప్పు పండడం వల్ల అక్కడ రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది… అంతా వచ్చి తక్కువ ధరకే జీడిపప్పును కొని పట్టుకెళ్తున్నారు. అది కూడా రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుండడం వల్ల కిలో 30 నుంచి 50 రూపాయలకే అమ్మాల్సి వస్తోంది. ఇంతగా జీడిపప్పు పండుతున్నప్పటికీ అక్కడ ఎలాంటి ప్రాసెసింగ్ ప్లాంటు లేదు. అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు, జీడిపప్పు ధర కూడా పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news