ఉన్నితో షూ లను అమ్ముతూ లక్షలు సంపాదిస్తున్న మహిళ..సక్సెస్ స్టోరీ..

-

ఈ మధ్య కాలంలో మహిళలు ఎందులో తక్కువ కాదని నిరూపిస్తున్న ఘటనలు చాలానే వెలుగు చూస్తున్నాయి. కష్టాలను ఎదుర్కొని నిలబడే వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు.మణిపూర్ లోని కక్చింగ్ చెందిన మొయిరంగ్ థెం ముక్తామణి దేవి జీవితంలో అదే జరిగింది. ఇప్పుడు ఆమెను లక్షల్లో ఆదాయం అందిస్తోంది. అలాగే భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును కూడా సొంతం చేసుకునేలా చేసింది. వీటితో పాటు అతి ముఖ్యమైనది ఏంటంటే.. ఎంతో మందికి శిక్షణ అందిస్తూ ఉపాధి కల్పిస్తోంది.

ఈమె 1991లో చెప్పులు కుట్టే పనిని ప్రారంభించింది. ఆమె తన కుమార్తె కోసం ఒక కొత్త జత బూట్లు కూడా కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉండేది. తన కుమార్తె పాత షూ చిరిగిపోయినప్పుడు, దానిని సరిచేయడానికి ముక్తామణి దగ్గర ఒక్క పైసా కూడా లేదు.పాత బూట్ల బేస్ తో ఉన్ని బూట్లను కుడుతుంది.తనకు తెలిసిన పనితోనే తన కూతురి షూను చక్కగా తయారు చేసింది. ఇది తన కుమార్తె ఉపాధ్యాయురాలిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆమె తన కుమార్తెకు కూడా అలాంటి షూసే కావాలని కోరుకుంది. అలా మొదలైన ప్రయాణాన్ని ముక్తామణి వ్యాపారంగా మలిచింది. అప్పటి నుండి ఆమె అలాంటి షూలను లక్షల్లో విక్రయిస్తోంది. అలాగే 2000 మందికి పైగా ఉన్ని చెప్పుల తయారీలో శిక్షణ ఇస్తోంది..

వేరే దేశాలకు కూడా ఆమె ఎగుమతి చేస్తుంది..వాణిజ్యం మరియు పరిశ్రమల రంగంలో ఆమె చేసిన కృషికి పద్మశ్రీ అవార్డు కూడా పొందింది.ముక్తామణిర తయారు చేసే ఉన్ని షూలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికోతో పాటు చాలా దేశాల్లో ముక్తామణి ఉన్ని షూలకు మంచి ఆదరణ ఉంది. ఏటా లక్షల్లో ఆర్డర్లు వస్తున్నాయి. వాటిని ఎంతో శ్రద్ధతో నిర్వర్తిస్తోంది ముక్తామణి. ఇలా తన బిజినెస్, తన నైపుణ్యానికి మంచి గుర్తింపు రావడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. అలాగే అది తన బాధ్యతను మరింత పెంచిందని చెబుతోంది. నాణ్యత పాటించే బాధ్యతను తను ఎప్పుడూ మోస్తూ ఉంటానని అంటోంది.వేల మందికి శిక్షణను అందిస్తుంది.ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలుస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news