50 పైసలకు మెరినా బీచ్‌లో టీ అమ్మిన ఆమె నేడు వంద కోట్లకు యజమాని

-

ప్యాట్రిసియా నాగర్‌కోయల్‌ జిల్లాలో జన్మించింది.. తల్లిదండ్రులు ఇద్దరికీ ప్రభుత్వం ఉద్యోగం..కాలేజ్‌ వయుసలోనే నారాయణ్ అనే వ్యక్తి ప్రేమలో పడింది. అతన్నే పెళ్లి చేసుకుంటా అని మొండిపట్టుపట్టింది.. ఇంట్లో వాళ్లు మతం వేరేది కావడంతో ఒప్పుకోలేదు.. 17 ఏళ్లకే ఇంట్లోంచి వచ్చి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది.. దీంతో ఆమెను శాశ్వతంగా దూరం పెట్టాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇంట్లో వాళ్లను ఎదిరించి పెళ్లి చేసుకున్నా.. ఆమెకు సంతోషం లేదు. భర్త అసలు రంగు భయటపెట్టాడు. డ్రగ్స్‌కు అలవాటు పడి భార్యను కొట్టడం మొదలుపెట్టాడు. ప్రతిరోజూ అతను ఆమెను కొట్టేవాడు.. ప్యాట్రిసియా జీవితం ప్రేమకథ విషాదంగా మారింది. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్యాట్రిసియా భర్త వ్యసనానికి గురై కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. ప్యాట్రిసియా తన కుటుంబాన్ని పోషించడానికి కాఫీ టీ అమ్మాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం ఆమె జీవిత చిత్రాన్ని మార్చేసింది. ఈమె జీవితం ఎలా మారిందో.. ఆమె వంద కోట్లకు యజమాని ఎలా మారిందో తెలుసుకుందాం.

చెన్నైలోని మెరీనా బీచ్‌లో ప్యాట్రిసియా టీ స్టాల్‌ను ప్రారంభించింది. 50 పైసలకే కప్పు కాఫీ అమ్ముతున్న ఆమెకు మొదట్లో చాలా కష్టమైంది. తరువాత, ఆమె తన ఆదాయాన్ని పెంచుకోవడానికి సమోసాలతో సహా కొన్ని స్నాక్స్ అమ్మడం ప్రారంభించింది. ఆమె రోజూ 50 రూపాయలు సంపాదించేది.
క్రమంగా ప్యాట్రిసియా క్యాటరింగ్ వ్యాపారంలో ఉద్యోగాల వేట ప్రారంభించింది. ప్రభుత్వ మరియు బ్యాంకింగ్ ఈవెంట్‌లను క్యాటరింగ్ చేయడం ప్రారంభించింది, ఒక ఫంక్షన్‌లో 2000 మందికి ఆహారం అందించడం ప్రారంభించింది. త్వరలో ఆమె వ్యాపారం విస్తరించింది, కానీ సంవత్సరాల తరువాత.. ఆమె భర్త మరణించాడు.

భర్త చనిపోతే మహిళలు కుంగిపోతారు. జీవితం శూన్యం అనుకుంటారు.. కానీ ప్యాట్రిసియా తన కలను వదులుకోలేదు. అయినా బతుకుబండిని ఈడుస్తూ ముందుకు పోతుంది.. విధి పరీక్ష అక్కడ ముగియలేదు. ప్రమాదంలో కూతురు, అల్లుడిని కోల్పోయింది. ఈ బాధను మరచిపోవడానికి, ప్యాట్రిసియా తన కుమార్తె పేరుతో తన కొడుకుతో కలిసి శాండిఫా హోటళ్లను తెరవాలని నిర్ణయించుకుంది. ప్యాట్రిసియా నారాయణ్ యొక్క రెస్టారెంట్ల చైన్‌ తమిళనాడు అంతటా విస్తరించింది. ఆమె లక్షాధికారి అయింది. ఇప్పుడు Sandifa రెస్టారెంట్లు రోజుకు రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.. ప్యాట్రిసియా నారాయణ్ మొత్తం నికర విలువ రూ. 100 కోట్లు అయింది. 50 పైసలు ఎక్కడా వంద కోట్లు ఎక్కడా.. ప్యాట్రిసియా తన జీవితం మొత్తం ఎన్నో కష్టాలను ఎదుర్కోంది. కట్టుకున్న భర్తను, కన్న కూతుర్ని పోగొట్టుకుంది. తల్లిదండ్రులను దూరం చేసుకుంది..ఒక సక్సస్‌ఫుల్‌ ఉమెన్‌ వెనుక ఇంత విషాదం ఉందని ఎవరూ ఊహించలేరు.

Read more RELATED
Recommended to you

Latest news