పర్యావరణహితంగా కరెంట్‌ను ఉత్పత్తి చేసిన రైతు..!

తన ఇంటికి ఎలాగైనా కరెంట్‌ తీసుకురావాలని ఈ రైతు ఎంత గానో శ్రమించాడు. ఆఖరికి అతి తక్కువ ఖర్చు తో, ఎవరి సహాయం లేకుండానే డిజైన్‌ చేసాడు. వివరాల్లోకి వెళితే… కర్ణాటక లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రైతు సిద్దప్ప తన ఇంటికి విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని హుబ్లీ విద్యుత్‌ సరఫరా కంపెనీని కోరాడు. కానీ అది మారుమూల గ్రామం కావడం తో వాళ్ళు నిరాకరించారు. అయితే ఎలాగైనా సరే కరెంట్‌ తీసుకు రావాలని భావించిన సిద్దప్ప పర్యావరణహితంగా కరెంట్‌ను ఉత్పత్తి చేయడం మొదలెట్టాడు.

farmer
farmer

అసలు కరెంట్ ని ఎలా తయారు చేసాడు అనే విషయానికి వస్తే.. నరాగుండ్‌ కొండలను గమనించిన సిద్దప్ప కరెంట్‌ తయారీ కోసం విండ్‌మిల్లు రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం తన దగ్గర ఉన్న వనరుల సాయం తో రూపొందించడం జరిగింది. తన ఇంటికి సమీపం లో ఓ కాలువు ప్రవహిస్తున్నది. అయితే విద్యుత్ కోసం రూ.5వేల ఖర్చుతో తన వద్ద ఉన్న ప్లాస్టిక్‌ ట్యూబులు, కలప, చక్రాలు ఇతర సామాగ్రి తో కరెంట్‌ ఉత్పత్తి అయ్యేలా డిజైన్‌ చేశాడు.

కాలువ ప్రవహిస్తేనే విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. 150 వాట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఈ మిల్లు ప్రస్తుతం 10 బల్బులు(60 వాట్లు), రెండు టీవీలకు అవసరమైన కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నది. ఇలా ఎంతో అద్భుతంగా రూపొందించడం తో టీమ్ ‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ రైతుని ప్రశంసించారు.