జీవితం సరికొత్తగా మారాలంటే మానేయాల్సిన కొన్ని పనులు..

-

జీవితం సాగుతున్న కొద్దీ కొన్ని పనులని మానేయాల్సి ఉంటుంది. లేదంటే అవి మరీ అతిగా మారి వ్యసనంగా తయారై మిమ్మల్ని దహించి వేస్తాయి. ఆ మంటల్లో మీరుకాలి బూడిద అవకముందే అది మంట అని గుర్తించి దాన్నుండి దూరంగా ఉండడం నేర్చుకోండి. జీవితంలో ఈ పది విషయాల్లో మిమ్మల్ని మీరు మార్చుకుంటే గెలుపెప్పుడూ మీ వెంటే ఉంటుంది.

అశ్లీల చిత్రాలు చూడడం

అశ్లీల చిత్రాలు చూడడం మానేస్తే చాలా మంచిది. అది డ్రగ్ లాంటిది. అలవాటైతే లేకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది. దానివల్ల మీ పనితీరు మీద ప్రభావం పడుతుంది.

ఇల్లు, తిండి, సౌకర్యాలు మొదలగు ఫ్రీగా వచ్చే వాటిని చులకనగా చూడవద్దు.

తొందరపాటులో పెళ్ళి చేసుకోవద్దు. మీ తల్లిదండ్రుల కోసమనో, మీ గర్ల్ ఫ్రెండ్ పోరు పెడుతుందనో, బాయ్ ఫ్రెండ్ తొందర పెడుతుందనో, సమాజం ఏమనుకుంటుందో అన్న ఆలోచనలతో పెళ్ళి చేసుకోవద్దు. పెళ్ళి చేసుకుంటే మీ లైఫ్ ఎలా ఉండబోతుంది? ఏ విధంగా తయారవుతుందన్న విషయాలు మీకే తెలుస్తాయి. ఎదుటి వాళ్ళ ప్రభావానికి ఎప్పుడూ గురి కావద్దు.

ఎవ్వర్నీ అంత ఈజీగా ఫాలో అవకండి. అందరూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో పొరపాట్లు చేసినవారే. నచ్చారని చెప్పి గుడ్డిగా ఫాలో అవడం అంత మంచిది కాదు.

బ్రాండెడ్ బట్టలని చెప్పి మీ తహతుకి మించి ఖర్చు చేయవద్దు.

మీ జీవితాన్ని ఇతరులు కంట్రోల్ చేసేలా ఉంచుకోవద్దు. మీరేది చేసినా, ఏది చేయాలనుకున్నా నిర్ణయం మీదే ఉండాలి.

మీకు నచ్చిన నటుడు చెప్పాడని వాళ్ళు చెప్పిన ప్రతీదీ పాటించవద్దు. చాలా మంది వ్యాపారాల కోసం మాత్రమే అందులో నటిస్తారని తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news