చేనేత పరిశ్రమను ఆదుకుందాం… నేతన్నకు చేయూతనిద్దాం..!

-

భారత దేశంలో వేలాది మది చేనేత కళాకారులు తమకు అన్నం పెట్టే చేనేత వృత్తిని వదిలి వేరే కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపదగా వర్థిల్లుతున్న చేనేత పరిశ్రమ ఇప్పుడు కునారిల్లుతున్నది. కొన్ని తరాల నుంచి ఈ పరిశ్రమ కొనసాగుతూ వస్తున్నది. దేశ సంస్కృతిని పెంపొందిస్తూనే ఉన్నది. కానీ.. నేతన్నలు చేనేతను వదిలి కూలి పనులు చేసుకుంటున్నారు. ఈ కళను ఇలాగే బతికిద్దాం. దాని కోసం మనం చేతులు కలుపుదాం.. నేతన్నకు చేయూతనిద్దాం.. అంటూ చేనత కళను బతికించడానికి ఓ చిన్ని ప్రయత్నం చేసింది ముగ్ధ ఆర్ట్ స్టూడియో అనే సంస్థ. చేనేత కళపై ఓ షార్ట్ ఫిలిం తీసింది. సోమ శేఖర్ దీనికి దర్శకత్వం వహించాడు. ఈ షార్ట్ మూవీని తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేసింది ముగ్ధ ఆర్ట్ స్టూడియో. నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ మూవీలో అన్నం పెట్టే చేనేత వృత్తిని వదిలి వేరే వృత్తికి వెళ్లి బాధ పడాల్సిన అవసరం లేదంటూ మనసుకు హత్తుకునేలా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నెటిజన్లు కూడా వీడియో సూపర్బ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఈ షార్ట్ మూవీ చూసి చేనేత కళను ఆదుకోవడం కోసం మీ వంతు సాయం చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version