అపర్ణ కేవలం ఇప్పుడే కాదు.. గతంలోనూ మానవత్వం ఉన్న గొప్ప మనిషిగా స్పందించింది. హాస్పిటల్ బిల్లు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఓ కుటుంబానికి తన మూడు బంగారు గాజులు అమ్మి రూ.60వేలు సహాయం అందజేసింది.
పురుషుల సంగతి అటుంచితే.. సాధారణంగా స్త్రీలు తమ శిరోజాలను పూర్తిగా తీసేయించి గుండు చేయించుకోవడానికి దాదాపుగా ఇష్టపడరు. ఇక దైవ కార్యమైతే కచ్చితంగా తీసేయాలి కాబట్టి తప్పదు కానీ.. మామూలుగా అయితే ఎవరూ తమ వెంట్రుకలను పూర్తిగా తొలగించేందుకు ఇష్ట పడరు. కానీ ఆ మహిళ.. అందులోనూ ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండి కూడా.. ఆమె తన వెంట్రుకలను పూర్తిగా తీసేయించుకుంది. అయితే అందుకు ఓ బలమైన కారణమే ఉంది. అదేమిటంటే…
కేరళలోని త్రిశూర్ జిల్లా ఇరింజలకుడ అనే ప్రాంతంలో సీనియర్ సివిల్ పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అపర్ణ లవకుమార్ ఇటీవలే క్యాన్సర్‌పై ఓ స్కూల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొంది. అక్కడ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారిని చూసి ఆమె చలించిపోయింది. అప్పుడే ఓ నిర్ణయం తీసుకుంది. తన జుట్టును తీసేసి క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం సహాయం చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఆ పని చేసింది. దీంతో ఆమెను ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు.
అయితే అపర్ణ కేవలం ఇప్పుడే కాదు.. గతంలోనూ మానవత్వం ఉన్న గొప్ప మనిషిగా స్పందించింది. హాస్పిటల్ బిల్లు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఓ కుటుంబానికి తన మూడు బంగారు గాజులు అమ్మి రూ.60వేలు సహాయం అందజేసింది. ఇప్పుడు క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం ఏకంగా తన పొడవాటి వెంట్రుకలను పూర్తిగా తీసేయించుకుంది. దీంతో ఆమె కరుణా హృదయానికి ఆమెను అందరూ ప్రశంసిస్తున్నారు..!