బస్సు ఎక్కితే చాలు వాంతులవుతున్నాయా? ఇలా చేయండి

-

చాలామందికి ప్రయాణాలంటే ఇష్టం ఉన్నా బస్సు పడకపోవడంతో విరమించుకుంటుంటారు. బస్సు ఎక్కితే చాలు కడుపులో తిప్పినట్లుగా ఉంటుంది. దాంతో వాంతులు అవుతాయి. దీని నుంచి బయటపడేందుకు ఇలా చేయండి.

– బస్సులు ఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులకు వాంతులు అవుతుంటాయి. నార్మల్‌గా కన్నా ఇప్పుడే ఎక్కువగా ఉంటుంది. ఇలా చాలామందికి వాహనాల ప్రయాణం సమయంలో వాంతులు అవుతుంటాయి.
– చిన్న అల్లం ముక్కను బుగ్గలోపల పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం చాలా తక్కువ. అలాగే అల్లంతో కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ వంటివి శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి.
– వాంతు వస్తుందని ముందుగా తెలిసినప్పుడు వక్కపొడిని చప్పరించినా వాంతుల నుంచి బయట పడవచ్చు.
– నిమ్మకాయను కొద్దికొద్దిగా నలుపుతూ ముక్కు దగ్గర పెట్టుకొని వాసన పీలిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
– లవంగాలు, సోంపు వంటివి దవడలో పెట్టుకొని చప్పరించినా కూడా వాంతులు రాకుండా ఉంటాయి.
– ఇన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఉండాలంటే బస్సు అలవాటు పడాలి. అలవాటు పడాలి అంటే అలవాటు చేసుకోవాలి. బస్సు, కారులో ప్రయాణం చేసేటపుపడు ముందు సీట్లో కూర్చొని సరిసరాలను గమనిస్తూ ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news