బంధం అంటే భయపడి సింగిల్ గా ఉండడానికి కారణాలివే..

-

బంధాలు బంధుత్వాలని పెంచుతాయి. అవే బంధాలు చాలా బంధాలను తెంచుతాయి. ఎలాంటి బంధాలు బంధుత్వాలని పెంచుతాయి? ఎలాంటివి తెంచుతాయనేది మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఐతే చాలా మంది బంధాల్లో ఇరుక్కోకుండా సంతోషంగా ఉండడానికి సింగిల్ గానే ఉండిపోతారు. సింగిల్ గా ఉండడం ఒక వయసు వరకు పెద్దగా సమస్య అనిపించదు. కానీ ఒక ప్రత్యేకమైన వయస్సు, ముఖ్యంగా 30దాటాక సింగిల్ గా ఉండడం కష్టం.

అలాంటి కష్టాలు వచ్చినా కొంతమంది సింగిల్ గానే ఉండిపోవడానికి గల ముఖ్య కారణాల్లో కొన్ని.

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడే బాగానే ఉంటుంది. కానీ చాలా మంది చావు భయం ఉంటుంది. అప్పటి దాకా మనతో మనమై కలిసిన వారు ఒక్కసారిగా దూరం కావాల్సి రావడం తట్టుకోరు. చావు భయం వల్ల, అంటే మనం బాగా కావాలనుకున్నవాళ్ళు ఎక్కడ దూరమైపోతారోనన్న భయంతో సింగిల్ గా ఉంటారు.

ఇంకా, పెళ్ళి అయిన కొత్తలో ఉండే ప్రేమ, ఆరునెలల తర్వాత ఉండకపోవచ్చని చాలా మంది సింగిల్ గా ఉండేవారి అభిప్రాయం. మొదటి పాయింట్ లో ప్రేమ ఎక్కువైతే రెండవ పాయింట్ లో ప్రేమ తక్కువ కావడం కారణం.

ఈ రెండూ చాలా పెద్ద కారణాలుగా ఉంటున్నాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని కారణాలని చూస్తే,

ఒకే వైపు నుండి ప్రేమ. గతంలో ప్రేమించిన వారి విషయంలో చేదు అనుభవాలు.

ప్రేమించిన వారికి సమయం ఇవ్వలేకపోవడం, డబ్బు, గమ్యం వాటిల్లో పడి ప్రేమకి, రిలేషన్ షిప్ కి సమయం లేకపోవడం. ఈ కారణాల వల్లనే చాలా మంచి సింగిల్ గానే ఉండిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news