నో చెప్పడం ఈజీ కాదు.. నో అనిపించుకున్నవారు అధములు కాదు..

-

ఏ విషయంలోనైనా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఈ ప్రపంచంలో ఏదైనా 100శాతం నిజం కాదు. ఎవ్వరేం చెప్పినా అది 99శాతం మాత్రమే కరెక్ట్ అయ్యుంటుంది. మిగిలిన ఒకశాతమైనా నిజమయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీకు ఎవరైనా నో చెప్తే బాధపడకండి. అది వాళ్ళ హక్కు. మీ అభిప్రాయానికి వారి అభిప్రాయానికి తేడా ఉందే తప్ప మీరు తప్పని కాదు. అందుకె నో అంటే బాధపడడం అనవసరం. బాధపడడం కంటే మీ అభిప్రాయాన్ని వారు అంగీకరించలేకపోయారనో, లేదా మీరు కలవాల్సిన వ్యక్తి వాళ్ళు కాదనో తెలుసుకోండి.

ముఖ్యంగా నో అనిపించుకుంటే మీలో కసి పెరుగుతుంది. అలా అని చెప్పి మీకు నో చెప్పిన వాళ్ళ మీద కోపం పెంచుకోకూడదు. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అందులో 99మందికి మీరు చెప్పేది నచ్చకపోయినా ఒక్కరుంటారు. మీ అభిప్రాయాలని ప్రేమించే వారు. వారిని పట్టుకోండి. నో చెప్తే మీ పని అయిపోయినట్టు కాదు. మీరింకా ఆ పనిని సక్రమంగా చేయాలని తెలుసుకోండి.

ఇక నో చెప్పడం గురించి ఆలోచిస్తే, చాలా మంది నో చెప్పడానికి భయపడతారు. ముఖ్యంగా తమ కంటే పెద్దవారికో, గొప్పవారికో నో చెప్పడానికి కష్టపడతారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. ఎవ్వరైనా ఎంత పెద్ద వారైనా వారి స్వలాభం చూసుకోకుండా ఏ పనీ చేయరు. మీకు లాభం రాకుంటే మీరు కూడా ఆ పని చేయవద్దు. లాభం అనగానే డబ్బుల గురించి ఆలోచించకండి. కనీసం మీరేదైనా చేస్తే అది మీ మనసుకి తృప్తిని ఇవ్వాలి. అలా ఇవ్వలేని పక్షంలో అది ఎంత పెద్దదైనా, ఎంత పెద్దవారు ఆఫర్ చేసినా నో చెప్పేయండి.

వాళ్ళు మీలాగే మనుషులే. పరిస్థితుల ప్రభావమో లేదా మరోటో వారిని గొప్పవారిని చేసి ఉండవచ్చు. అలా అని వారడిగారని చెప్పి మీకు నష్టం కలిగే పనిని ఒప్పుకోవద్దు. మొహమాటానికి పోతే కడుపయ్యింది అనే సామెత ఇక్కడ గుర్తుంచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news