ఇది టెక్నాలజీ యుగం. ఆ టెక్నాలజీ యుగమే మనుషులను సోమరులను చేస్తోంది. దానికి ఉదాహరణలు చెప్పుకోవాల్సిన పని లేదు. చివరకు తినే తిండి కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నాం. అఫ్ కోర్స్.. వాటి వల్ల ఓ పది మందికి ఉపాధి కలుగుతుంది.. అది వేరే విషయం. సాధారణంగా ఆన్‌లైన్ ఫుడ్ యాప్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. జొమాటో, స్విగ్గీ, ఉబెర్ ఈట్స్ లాంటి ఎన్నో యాప్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి.
తాజాగా.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. జొమాటో యాప్‌కు చెందిన ఓ డెలివరీ బాయ్‌కి సంబంధించిన వీడియో అది. అతడు దివ్యాంగుడు. అన్నీ సక్రమంగా పనిచేసే వాళ్లే ఈరోజుల్లో ఏ పని చేయకుండా ఒకరి మీద ఆధారపడి బతుకుతుంటారు. కానీ.. నడవలేని స్థితిలో ఉన్నా.. జొమాటో ఆర్డర్లను డెలివరీ చేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడుతున్నాడు. అందుకే.. ఆ వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. మనోడిని ప్రశంసల్లో ముంచెత్తారు. నువ్వు గ్రేట్ బాసూ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
#Zomato you keep rocking , you made my day , this man is the inspiration for all who thinks there’s life is screwed , please make this man famous pic.twitter.com/DTLZKzCFoi
— Honey Goyal (@tfortitto) May 17, 2019