ఈసారి వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియాలు మాత్రమే ఫేవరెట్ జట్లని మాజీ క్రికెట్ ప్లేయర్లు, విశ్లేషకులు, వ్యాఖ్యాతలు తేల్చేశారు. దీంతో ఈ మూడు జట్ల మధ్యే త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ మూడు జట్లలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు భారత్ అంటే భయపడుతున్నాయట.
మరో 11 రోజులు మాత్రమే గడువుంది.. అదేనండీ.. ఐసీసీ వరల్డ్ కప్ 2019కు కేవలం 11 రోజులు మాత్రమే సమయం ఉందని చెబుతున్నాం. దేశంలో ఓ వైపు ఎన్నికల ఫలితాల వేడి, మరోవైపు క్రికెట్ వేడి.. రెండూ కలిపి అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మరో 4 రోజుల్లో ఎన్నికల ఫలితాలు ఎలాగూ వచ్చేస్తాయి. కానీ క్రికెట్ పండుగకు మరో 11 రోజులు ఆగాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈసారి వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారోనని అభిమానులు ఇప్పటికే బాగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ సారి కప్ ఎవరికి వచ్చినా.. కప్ బరిలో నిలిచిన అన్ని దేశాలూ.. భారత్‌ను చూసి భయపడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈసారి వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియాలు మాత్రమే ఫేవరెట్ జట్లని మాజీ క్రికెట్ ప్లేయర్లు, విశ్లేషకులు, వ్యాఖ్యాతలు తేల్చేశారు. దీంతో ఈ మూడు జట్ల మధ్యే త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ మూడు జట్లలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు భారత్ అంటే భయపడుతున్నాయట. ఎందుకంటే.. ఐపీఎల్‌లో హిట్ అయిన చాలా మంది హీరోలు ఇప్పుడు భారత జట్టులో ఉన్నారు. అంతేకాదు, ఒకటి, రెండు సిరీస్‌లలో ఓడిపోయినప్పటికీ.. భారత్ గతంలో జరిగిన అనేక ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయఢంకా మోగించింది. దీంతోపాటు అటు కోహ్లి, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, ధోనీ, కేఎల్ రాహుల్‌లతోపాటు ఇటు భువనేశ్వర్ కుమార్, బుమ్రా, షమీ, చాహల్ వంటి బౌలర్లు, జడేజా, జాదవ్, విజయ్ శంకర్ వంటి ఆల్‌రౌండర్లతో భారత జట్టు దుర్భేద్యంగా మారింది. దీంతో ఇప్పుడు కేవలం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లే కాదు, ఇతర టీంలు కూడా భారత్ అంటే భయపడుతున్నాయట.
ఈ సారి వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్న అన్ని జట్లకు భారత్ ప్రధాన ప్రత్యర్థిగా మారే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. భారత జట్టు అన్ని విభాగాలు, అంశాల్లోనూ మెరుగ్గా ఉందని, ఆ జట్టును చూసి ఇతర జట్లు భయపడుతున్నాయని వారంటున్నారు. అలాగే ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఆల్‌రౌండర్లు భారత జట్టులో ఉండడం ఆ జట్టుకు కలసి వస్తుందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే భారత్ ప్రతి మ్యాచ్‌ను సవాల్ గా తీసుకుని ఆడాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు. మరి నిజంగానే మాజీ క్రికెటర్లు చెప్పినట్లు భారత్ ఈసారి అన్ని జట్లకు గట్టిపోటీనిస్తుందా, లేదా పేలవంగా ఆడుతుందా.. అన్నది తెలియాలంటే.. మరికొద్ది రోజుల వరకు ఆగక తప్పదు..!