100 ఏళ్లనాటి పాత భవనం.. ఆ దంపతుల కన్నుపడింది.. కట్ చేస్తే.. ఇంద్రభవనంలా మార్చేశారుగా..!

-

మనలో క్రియెటివ్ థాట్స్ ఉండే..ఎందుకు పనికిరాని దాన్ని కూడా.. అద్భుతంగా తీర్చి దిద్దవచ్చు. ఈరోజుల్లో అందరూ సిటీ లైఫ్ కి అలవాటు పడిపోయారు.. ఇంట్లో ఉన్నప్పటికీ.. పొద్దున్నే వెహికల్స్ సౌండ్స్, చెత్తబండి నుంచి వచ్చే పాటలు.. లేదా.. ఉల్లిపాయలు అమ్మేవాళ్ల అరుపులు వీటితోనే నిద్రలేవడం అవుతుంది. అసలు ఒకసారి ఊహించుకోండి.. అప్పుడే తెల్లారుతుంది..పక్షుల కిలకిలరవాలు, మోము మీద..సూర్యుడు హాయ్ చెప్పినట్లు..గోరువెచ్చని సూర్యకిరణాలు పడుతుంటే..అలా లేచి.. కిటికీ నుంచి బయటకు చూస్తే.. చూసినంత లెక్క విశాలమైన వాతావరణం, దగ్గర్లో అడవి తల్లి నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి.. ఈ లోకెషన్ లో ఓ కప్పు కాఫీ తాగుతుంటే ఉంటుందిరా..ఆహా..! నెక్స్ట్ లెవల్ కదా.. ఓ దంపుతులు 100 ఏళ్ల నాటి పాడపడిన భవనాన్ని అందంగా మార్చి.. పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దారు.
సునీతా, అమర్‌జీత్, వారి కూతురు సృష్టి.. తమ డ్రీమ్ ప్రపంచం కోసం ప్లాన్స్ వేసుకున్నారు. ఒకప్పుడు బ్రిటీష్ కాలంలో పట్టణంగా, కంటోన్మెంట్‌గా ఉండి.. ఆ తర్వాత క్రమంగా పాతదైపోయిన ప్రాంతం అది. అక్కడ 11 ఏళ్లుగా మంచి మార్పు వచ్చింది.వేకేషన్‌లో భాగంగా అక్కడికి వెళ్లిన సునీతా, అమర్‌జీత్… అక్కడి 100 ఏళ్ల పాత భవనాన్ని చూశారు. బాగా నచ్చేసింది. వెంటనే ఆ భవనాన్ని లీజుకి కొనేసి… దాన్ని హోమ్‌స్టేగా మార్చుకున్నారు.. అప్పుడప్పుడూ వేకేషన్‌లో ఉండేందుకు దాన్ని కొనుక్కున్నా… ఇప్పుడు అదే వారి శాశ్వత ఇల్లు అయిపోయింది. అద్భుతంగా మారిన ఆ ఇంటికి ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి గెస్టులు వస్తున్నారంటే.. అది ఎంత అందంగా ఉందో మీరే ఆలోచించండి.
ఆతిథ్య (hospitality sector) రంగంలో పనిచేసిన ఈ దంపతులు… వృత్తిలో భాగంగా… ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో ఉండేవారు. 2005లో బ్రిటీష్ ఫారిన్ కామన్ ఆఫీస్‌లో అమర్‌జీత్ రీజనల్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా పనిచేశారు. ఈ వృత్తిలో అమర్‌జీత్… 9 దక్షిణ ఆసియా దేశాల వారికీ, ఇతర దేశాల వారికి ఆతిథ్య రంగానికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం లభించింది. 2007లో వీరికి సృష్టి పుట్టింది. అప్పటికే సిటీ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ఈ కపుల్.. తమ కూతురికి మాత్రం… ఆ పరిస్థితి ఉండకూడదని నిర్ణయించుకున్నారు.
2009లో ఈ దంపుతులు.. ఉత్తరాఖండ్.. ముస్సోరిలోని… లాండోర్ (Landour)కి వేకేషన్ కోసం వెళ్లారు.. ఆ ప్రదేశం వారికి బాగా నచ్చింది. అక్కడే పాత బంగ్లాని చూశారు. అది అమ్మకానికి ఉందని తెలియడంతో… 33 ఏళ్ల లీజుకి తీసుకున్నారు. ఈ భవనం కొనేందుకు ఈ దంపతులు ముంబైలోని ఇంటిని అమ్మేశారు. తమ ఉద్యోగాలను వదిలేశారు. స్టాక్‌మార్కెట్లలో షేర్లను సైతం అమ్ముకున్నారు. అన్ని వదులుకుంటే కానీ.. ఆ భవనం వీరి సొంతమైంది.
ఇందులో 9 గదులున్నాయి. మూడు గదుల్లో ఈ ఫ్యామిలీ ఉంటోంది. మిగతా ఆరింటినీ గెస్ట్ రూములుగా మార్చేసింది. మే 2011 నుంచి ఈ భవనం టూరిస్టులకు ఆతిథ్యం ఇస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ వేల మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చారు. వారి కోసం ఈ దంపతులు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. దాని ద్వారా 1.3 లక్షల లీటర్ల నీటిని స్టోర్ చేస్తున్నారు. అలాగే… 1000 లీటర్ల కెపాసిటీ ఉన్న సోలార్ హీటర్ ను వాడుతున్నారు.
ఈ భవనంలో 140 మంది ఉద్యోగులున్నారు. అందరూ స్థానికులే. ఇలా అటు టూరిస్టులకు తగిన సౌకర్యాలు కల్పిస్తూ… ఇటు స్థానిక పేదలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ… ఈ కుటుంబం… తమకు నచ్చిన బొమ్మరిల్లులో హాయిగా జీవిస్తోంది. ఓ ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఇదేనేమో.. పాత భవనం, దీన్ని ఏం చేసుకుంటాం.. దీని కోసం సొంత ఇళ్లు, ఉన్న కొద్దోగొప్పో ఆస్తులు ఎందుకు అమ్ముకోవడం అని ఆనాడు ఈ జంట అనుకుని ఉంటే.. నేడు ఈ విజయం సాధించకపోయే వారు కదా..!

Read more RELATED
Recommended to you

Latest news