60 సెకండ్లలో 6 ఇడ్లీలు తిన్న 60 ఏళ్ల బామ్మ..వీడియో

-

దక్షిణాదిన అందునా తెలుగువారి విషయానికి వస్తే పొద్దున్నే టిఫిన్ అన్నంతనే గుర్తుకు వచ్చేది ఇడ్లీ. అంతదాకా ఎందుకు హోటళ్లు కానీ.. ఇళ్లల్లో కానీ.. ఎక్కడైనా కానీ ఉదయాన్నే టిఫిన్ ప్రయారిటీలో ఫస్ట్ ప్లేస్ ఇడ్లీదే. తర్వాతే మిగిలిన ఏ టిఫిన్ అయినా. ఇడ్లీతో మొదలెట్టి.. రకరకాల టిఫిన్లు తినటం అలవాటే.
ఇంత చక్కటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇడ్లీని పిల్లలు తినటానికి పెద్దగా ఇష్టపడరు.

కానీ.. ఇప్పుడు ఇదే ఇడ్లీ అరవైఏళ్ల బామ్మకు కొత్త గుర్తింపు దక్కేలా చేయటమే కాదు.. రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది. అదెలానంటే.. ఇడ్లీ అందరికి ఇష్టమైన టిఫినే కానీ.. అదే పనిగా తినలేరు. మహా అయితే చిన్న ఇడ్లీలు నాలుగు తినేసరికి బోర్ కొట్టేస్తుంది. అదే.. పెద్దవైతే రెండు తినేసరికే కళ్లు బైర్లు కమ్మేస్తాయి.

,

అలాంటిది అరవై ఏళ్ల పెద్దావిడ అరవై సెకన్లలో ఏకంగా ఆరు ఇడ్లీలు తిన్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. అందరి చూపు సదరు బామ్మ మీద పడేలా చేసింది. దసరా ఉత్సావాల్లో భాగంగా మైసూరులోని ఒక దేవాలయం వద్ద నిర్వహించిన ఇడ్లీ పోటీలో హుల్లహల్లి ప్రాంతానికి చెందిన సరోజమ్మ అనే పెద్దావిడ రికార్డు స్థాయిలో నిమిషయంలో ఏకంగా ఆరడజను ఇడ్లీలు తినేసి అందరిని అవాక్కు అయ్యేలా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version