ఈ ఏడు ప్రదేశాలలో ఇండియన్ కరెన్సీ మిమ్మల్ని ధనవంతులు అనిపించేలాగ చేస్తుంది…!

-

కంబోడియా:

చూడదగ్గ ప్రదేశాల్లో కంబోడియా ఒకటి. ఇక్కడికి అనేక మంది పర్యాటకులు వచ్చి వీక్షిస్తారు. పైగా ఇక్కడ ఇండియన్ కరెన్సీ విలువ కూడా చాలా ఎక్కువ. ఇక్కడ సైకిల్ ని అద్దెకి తీసుకుని సరదాగా ఊరంతా చూడండి. అలాగే ఇక్కడ ఉండే Angkor Wat, Siem Reap వంటివి చూడండి. ఇక్కడ నైట్ మార్కెట్ చాలా ఫేమస్. పైగా ఎంతో బాగుంటుంది.

జింబాబ్వే:

జింబాబ్వే లో చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి మరియు ఇక్కడ ఎన్నో రకాల ఫుడ్ ను మీరు టేస్ట్ చేయవచ్చు. ఇక్కడ ఇండియన్ కరెన్సీ విలువ కూడా చాలా ఎక్కువ. దీని వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ కల్చర్, షాపింగ్ నైట్ లైఫ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

ఇక్కడ ఉండే నైట్ లైఫ్ కూడా బాగుంటుంది. దీనిని కూడా ఒక సారి చూడొచ్చు. ఇక్కడ చాలా రకాల నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ముఖ్యంగా విక్టోరియా ఫాల్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. పులులు, చిరుతలు, ఏనుగులు లాంటి వాటిని దగ్గరగా చూడొచ్చు. ఈ ప్రదేశాలు అన్నిటి మీరు ఎంత చీప్ గా చూడొచ్చు.

పరాగ్వే:

సౌత్ అమెరికా లో ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. పైగా రేటు కూడా తక్కువే. ఇక చారిత్రక భవనాలు, రెస్టారెంట్లు, బార్లు ఎన్నో ఉంటాయి. Palacio de los Lopez కూడా మీరు తప్పక చూడాలి. ఇక్కడ ఉండే రివర్ బీచ్ చాలా పెద్దది. ఇండియా నుంచి ఇక్కడికి ఫ్లైట్స్ కూడా ఉంటాయి.

లావోస్:

Vientiane క్యాపిటల్ ఇది. ఈ ప్రదేశం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ బుద్ధిష్ట్ టెంపుల్స్ అదే విధంగా నోరూరించే ఆహార పదార్థాలు ఇలా ఎన్నో ఆకట్టుకుంటాయి. దీనిని కూడా తక్కువ ఖర్చుతో చూసేయొచ్చు. ఈ ప్రదేశాలు అన్నిటి నుంచి చూస్తే మంచి అనుభవం మీకు లభిస్తుంది. ఇక్కడ పులులు, చిరుత పులులు మొదలైన జంతువులుని చూడొచ్చు. The Bokeo Nature Reserve Huay Xai కూడా మిస్ కాకూడదు.

కొలంబియా:

తక్కువ ఖర్చుతో సౌత్ అమెరికా ప్రదేశాలు చూడచ్చు.ఎందుకంటే ఇక్కడ ఇండియన్ కరెన్సీ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా కొలంబియాని కూడా చూడండి ఇక్కడ మంచి అడవులు ఉంటాయి.

అదే విధంగా కొలంబియాలో ట్రెషర్ ట్రోవ్ ఉంటుంది ఇలా చెప్పుకు పోతే చాలా ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎంతో టేస్టీ మరియు మంచి సువాసన ఇచ్చే కాఫీ మాత్రం తప్పక తీసుకోవాలి. పైగా కేఫ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి.

శ్రీలంక:

శ్రీలంక కూడా ఎంతో ఆకర్షణీయమైన ప్రాంతం. భారత దేశం నుంచి చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ వుండే కేఫ్స్, బార్స్, షాపింగ్ అన్ని బాగుంటాయి. ఇక్కడ టీ ప్లాంటేషన్ ని కూడా చూడొచ్చు. Uppuveli అండ్ Nilaveli ని కూడా తప్పక చూడండి.

ఇండోనేషియా:

ఇండోనేషియాలో వరి పొలాలు, దేవాలయాలు ఇలా ఎన్నో ఉంటాయి. ఆర్కిటెక్చర్ గురించి ముఖ్యంగా చెప్పుకునే తీరాలి. ఇక్కడ కూడా రూపాయలకి విలువ ఎక్కువ ఉంది. సరదాగా కుటుంబంతో వెకేషన్ ఏమైనా వేసుకోవాలంటే ఇక్కడకి కూడా వెళ్లొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news