కరోనా విషయంలో గుడ్ న్యూస్.. ఒక్కరోజే !

ఇండియాలో ఓవైపు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ గట్టిగా నడుస్తున్నా ఉన్నా… కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. మనదేశంలో గడిచిన 24 గంటల్లో 3,79,257 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 2,69,507 మంది కోలుకోగా.. మరణాలు కూడా భారీగా నమోదయ్యాయి. ఏకంగా 3645 మంది మరణించారు. 

అయితే సంతోషించదగ్గ విషయం ఏమిటంటే భారీ ఎత్తున రికవరీలు నమోదు అవ్వడమే అని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి పేర్కొన్నారు. తాజా లెక్కలతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524కి చేరింది. వీరిలో 1,50,86,878 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 2,04,832 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 30,84,814 యాక్టివ్ కేసులున్నాయి.