ప్రయోగాన్ని పరిక్షించేందుకు ఏకంగా 54 అయస్కాంత బాళ్లు మింగాడు..!

-

చిన్న పిల్లలు ఏదైన చేయాలంటే అది చేసే దాకా వదలారు. అది తప్పని చెప్పిన ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఆ పని చేసే తీరుతారు. చివరకు ప్రాణాలపై కి తెచ్చుకుంటారు. అలాంటి ఘటన ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. ఇంగ్లాండ్‌లోని గ్రేట్‌ మాంచెస్టర్‌కు చెందిన రిలే మోరిసన్‌ (12)కు సైన్స్‌ అంటే మక్కువ. ప్రయోగాలు చేయాలంటే ఎంతో ఇష్టపడుతాడు. అప్పుడప్పుడు చిన్నచిన్న ప్రయోగాలు చేస్తునే ఉంటాడు. ఈ సారీ ఆశ్చర్యానికి గురి చేసే ప్రయోగాన్ని చేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఆయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుందని తెలుసుకున్న మోరిసన్, చిన్నచ్ని ఆయస్కాంత బాళ్లను మింగితే తన పొట్ట ఆయస్కాంతంలా పని చేస్తోందని భావించాడు.

విడతల వారీగా..

దీనిపై ప్రమోగం చేద్దామని జనవరి మొదటి తేదీ నుంచి ఆయస్కాంత బాళ్లను మింగడం ప్రారంభించాడు. విడతల వారీగా మొత్తం 54 ఆయస్కాంత బాళ్లను మింగాడు. ఇంట్లో తెలియకుండా ఓ గదిలోకి వెళ్లి ఐరన్‌ స్టిక్‌ తీసుకొని తన పెట్టపై పెట్టుకున్నాడు. పొట్టపై పలుచోట అటూ ఇటూ పెట్టినా అది ఎంతకీ అతుక్కోలేదు. దీంతో తాను మింగిన బాళ్లన్నీ టాయిలెట్స్‌ ద్వారా బయటకు వెళ్లినట్లు భావించి వాష్‌రూంలోకి వెళ్లి చూడగా అక్కడా కనిపించకపోవడంతో కంగారు పడిపోయాడు. వాటిని ఎలా బయటకు తీయాలో వాంతులు చేస్తూ నానా తంటలు పడ్డాడు. ఎంతకూ అవి బయటకు రాకపోవడతో మరింత భయపడ్డాడు.

తల్లితో రెండే అన్నాడు..

ఆ తర్వాత తన తల్లి, పైజ్‌వార్డును నిద్రలేపి తాను పొరపాటున రెండు ఆయస్కాంత బాళ్లు మింగానని చెప్పడంతో ఆమె హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎక్స్‌రే తీయగా మోరిసన్‌ కడుపులో ఏకంగా 54 చిన్నచిన్న బాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇవి ఇలాగే ఉండే కడుపులోని ఇతర భాగాలు దెబ్బతిని ప్రాణం పోయే అవకాశం ఉందని తల్లికి చెప్పి సర్జరీ చేసి వాటిని బయటకు తీశారు. అప్పటికి పేగుకు చిన్నరంధ్రం పడి ఆకుపచ్చని ద్రవం విడుదల కావడంతో అతను అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆ ద్రవన్ని కక్కించిన తర్వాత కాస్త ఆరోగ్యం కుదుట పడింది. రెండు వారాల తర్వాత మోరిసన్‌ను ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news