ఆటిజంతో బాధపడుతున్న గర్భిణికి అన్ని పనులు చేసిన శునకం

-

మనుషులకంటే కుక్కలకే విశ్వాసం, ప్రేమ ఎక్కువగా ఉంటుందని అందరూ అంటారు. ఎన్నో సార్లు మనిషి ఆపదలో ఉన్నప్పుడు కుక్కుల కాపాడిన ఘటనలు కూడా ఉన్నాయి. వాటి మన మూడ్‌ స్వింగ్స్‌ అన్నీ తెలుస్తాయి. తాజాగా ఆటిజంతో బాధపడుతున్న ఓ మహిళకు శునకం చేసిన సహాయం ఇప్పుడు అందరి మన్ననలు అందుకుంటోంది.

స్టాఫోర్ట్ షైర్ బుల్ టెర్రియిర్ జాతికి చెందిన బెల్లె పేరు గల శునకాన్ని యూకేలోని ఓ ఆస్పత్రి లేబర్ వార్డులోకి సైతం అనుమతించింది. మహిళల ప్రసవించిన బెడ్ వద్దకు రావడమే కాదు, దానిపై కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇలా ఓ కుక్కను లేబర్ వార్డులోకి అనుమతించడం అసలు జరగదు. యూకేలో ఇలా శునకాన్ని లోపలికి అనుమతించడం ఇదే మొదటిసారి అని నివేదికలు పేర్కొంటున్నాయి. మిల్టన్ కీన్స్ యూనివర్సిటీ హాస్పిటల్ లో ఈ ఘటన జరిగింది. శునకం ఏం చేసిందో తెలుసా..?

అమీ టామ్‌కిన్‌ అనే మహిళ ఆటిజంతో బాధపడుతోంది. తన పని కూడా తనకు చేసుకోలేదు. ఇల్లు కదల్లేని దుర్భర పరిస్థితిలో బెల్లెనే తనకు సాయం చేసింది. స్టాఫోర్ట్ షైర్ బుల్ టెర్రియిర్ జాతికి చెందిన బెల్లెకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఇది తన యజమానులకు అన్ని రకాలుగా సహాయం చేస్తుందట. ఆటిజంతో బాధపడే మహిళ అమీ టామ్‌కిన్‌కు బెల్లె అన్ని రకాలుగా సాయం చేసేంది. నిత్యావసర సరకులు కూడా తనే బయటకు వెళ్లి తీసుకువచ్చేది. అమీ ఎప్పుడైనా ఆందోళనకు గురయ్యే ముందే బెల్లె గుర్తించి సాయం చేసేది. లిఫ్ట్‌లో వెళ్తుంటే తనే బటన్ నొక్కేది. డెబిట్ కార్డుతో బిల్ పేమెంట్ చేసేదని అమీ తెలిపారు. అలాంటి బెల్లె లేకుండా తను ఉండలేకపోయేదాన్ని అని ఆటిజంతో బాధపడుతున్న అమీ వెల్లడించారు.

ప్రసవం జరుగుతున్నప్పుడు పక్కనే శునకం

గర్భం దాల్చినప్పటి నుంచి అమీని బెల్లె చాలా జాగ్రత్తగా చూసుకుంది. సరకులు తీసుకురావడంలో, వైద్యుల వద్దకు వెళ్లడంలో మిగతా అన్ని విషయాల్లోనూ బెల్లె సహకారం లేకుండా తాను ఏ పనీ చేయలేకపోయేదాన్ని అని అమీ తెలిపారు. బెల్లె చేసే పనుల గురించి తెలుసుకున్న వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. అమీకి, బెల్లెకు ఉన్న అనుబంధాన్ని చూసి లేబర్ వార్డులోకి సైతం ఆ కుక్కను తనను అనుమతించారు. అమీకి ప్రసవం జరుగుతున్న సమయంలో బెల్లె తన పక్కనే ఉంది. అలా అమీకి తానెప్పుడూ సాయం చేస్తూనే, చేదోడువాదోడుగా ఉంటూనే ఉంది బెల్లె

Read more RELATED
Recommended to you

Latest news