ఓర్ని ఇదేందయ్యా..పాములతో విన్యాసాలు..ఆపై..

-

పాములు అంటేనే ఆమడ దూరం పోతారు..అవి విష సర్పాలు కాబట్టి జనాలు వాటి దగ్గరకు పోవడానికి కూడా సాహసించరు.అలాంటిది పాములతో విన్యాసాలా..అదేలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా..మీరు విన్నది అక్షరాల నిజం..అలా చేస్తేనే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని వారి నమ్మకం.అసలు ఆ ఆచారం ఎక్కడ ఉంది. దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…


వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల ప్రజలు తమ ఆరాధ్య దేవతను ప్రసన్నం చేసుకోవడానికి వారి సొంత సంపద్రాయాలను పాటిస్తారు..ఈ మేరకు జార్ఖండ్‌లో మానస దేవిని పూజించే సమయంలో భక్తులు తమ విశ్వాసాన్ని ప్రత్యేకమైన సంప్రదాయంతో వ్యక్తపరుస్తారు. మానస దేవి పూజ సమయంలో భక్తులు చాలా విషపూరితమైన పాములను పట్టుకుని నృత్యం చేస్తారు. వారితో రకరకాల విన్యాసాలు చేస్తారు. ఈ క్రమంలో పలుమార్లు విషసర్పం కూడా భక్తులను కాటేస్తుంది.

అవును జార్ఖండ్‌లోని గిరిజనులు తమ సాంప్రదాయ పండుగ మానసాదేవి పండగను జరుపుకుంటారు, ఈ సమయంలో భక్తులు హిందూ దేవత మానస దేవిని ప్రసన్నం చేసుకోవడానికి పాములు కాటువేయడం అనే ప్రత్యేకమైన ఆచారాన్ని పాటిస్తారు. మహూలియా సోల్ గ్రామంలో పాము కాటు వేసే సమయంలో భక్తులు తమ శరీరమంతా మూలికా ఔషధాలను పూసుకుంటారు. ముఖ్యంగా పాముల విషం నుండి తమని రక్షించే ఎక్లావి అనే ప్రత్యేకమైన మూలికా ఔషధాన్ని తీసుకుంటారు..అప్పుడు తమను ఎలాంటి విష పురుగులు కుట్టినా కూడా ఎటువంటి ప్రమాదం ఉండదని వారు చెబుతున్నారు.మానస పూజ సమయంలో చుట్టూ ఉన్న అన్ని విషపూరిత పాములను మంత్రం సహాయంతో సేకరిస్తారు. మానస దేవి అందమైన విగ్రహాన్ని బెంగాల్ లేదా చుట్టుపక్కల కళాకారులు తయారు చేస్తారు. అదే సమయంలో మానస మా విగ్రహంలో ఒక పాముని కూడా ఏర్పాటు చేస్తారు..

భక్తులే కాకుండా విషసర్పాలు కూడా మానస దేవి భక్తిలో మునిగి నాట్యం చేస్తాయి. అదే సమయంలో ప్రజలు తమ మెడలో కొండచిలువ, నాగుపాము వంటి విష సర్పాలను ధరించి తిరుగుతారు. వారు వాటిని నోటితో నొక్కుతారు, తమని తాము కరిపించుకుంటారు. ఈ సమయంలో మనసాదేవి అనుగ్రహంతో పాములలోని విషం తమకి హాని చేయదని విశ్వాసం..ఆ పూజ అనంతరం వాటిని మళ్ళీ అడవుల్లో విడిచిపెడతారు. ప్రతి సంవత్సరం ఈ పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఉంటుందని.. తమ గ్రామస్థులను పాము కరవవని నమ్మకం. మానస పూజ సమయంలో వ్రతాలు చేసే భక్తుల కోరికలు ఎల్లప్పుడూ నెరవేరతాయని నమ్మకం..అలా వారు ఒక నెల పాటు పూజలు నిర్వహిస్తారు..ఆ విన్యాసాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..మీరు కూడా ఒకసారి చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news