సిబ్బందికి ఎయిర్‌ ఇండియా న్యూ రూల్స్..జుట్టు ఎక్కువగా ఊడేవాళ్లు గుండు చేయించుకోవాలి..

-

ఎయిర్‌ హోస్టెస్‌ భలే ఉంటారు కదా.. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అసలు వీళ్లు మనుషులేనా లేక ఎక్కడినుంచి అయినా దిగి వచ్చారా అనిపిస్తుంది.. కొందరైతే..మరీ అందంగా ఉంటారు.. ఎయిర్‌హోస్టెస్‌ గురించి చాలామంది అనుకునే కామన్‌ అభిప్రాయాలు ఇవి. అయితే ఒక్కో కంపెనీ ఎయిర్‌ హోస్టెస్‌ ఒక్కోలా ఉంటారు.. కొందరు స్కట్స్‌ వేస్తే..మరికొందరు చీరులు కట్టుకుంటారు.. అయితే టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను టేకోవర్ చేసుకున్న తరువాత మిగిలిన సంస్థల మాదిరి లాభాల వైపు నడిచేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. అన్ని విభాగాల్లో కీలక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా ఎయిర్ హోస్టెస్, సిబ్బంది ప్రవర్తన, వస్త్రధారణ తదితర విషయాలపై కొత్త మార్గదర్శలను విడుదల చేసింది. పురుషులకు, మహిళా సిబ్బందికి వేరువేరు మార్గదర్శకాలను యాజమాన్యం విడుదల చేసింది.

జుట్టు ఊడేవాళ్లు గుండు చేయించుకోవాలి..

ఎయిర్ ఇండియా‌లో పనిచేసే పురుష సిబ్బంది తప్పనిసరిగా హెయిర్ జెల్ వాడాలి. బట్టతల ఉన్నవారు, తల వెంట్రుకలు ఎక్కువగా ఊడేవారు పూర్తిగా గుండు చేయించుకొని విధులకు హాజరు కావాలని, ప్రతీరోజూ షేవ్ తప్పని సరి అని మార్గదర్శకాల్లో యాజమాన్యం తెలిపింది. అదేవిధంగా తెల్లవెంట్రుకలు ఉన్నవారు సహజసిద్ధంగా ఉండేలా వారి జుట్టుకు రంగు వేసుకోవాలట.

మహిళ సిబ్బందికి కూడా ప్రత్యేక మార్గదర్శకాలను సంస్థ విడుదల చేసింది. అవేంటంటే.. మహిళా సిబ్బంది జుట్టు నెరిసిపోతే సహజ షేడ్స్ లేదా కంపెనీ హెయిర్ కలర్ షేడ్ కార్డ్‌లో ఉండే రంగులు వేసుకోవాలి. ముత్యాల చెవిపోగులు ధరించకూడదు. డిజైన్ లేకుండా బంగారం, డైమండ్ ఆకారపు చెవిపోగులు మాత్రమే ధరించాలి. రింగ్స్ వెడల్పు 1సెంటీమీటర్ కంటే ఎక్కువగా ఉండకూడదు. మణికట్టు, మెడ, చీలమండపై నలుపు లేదా మతపరమైన దారాలు కట్టుకోవడాన్ని కూడా నిషేధించారు. ఎయిర్ హోస్టెస్ చేతికి డిజైన్ బ్యాంగిల్స్ వేసుకోకూడదు… లిప్‌స్టిక్, నెయిల్ పెయింట్ తదితర వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మార్గదర్శకాల్లో ఎయిర్ ఇండియా పేర్కొంది. ఇవి కామన్‌గా ఎయిర్‌ హోస్టెస్‌కు ఉండేవే అయినా.. ఇందులో కాస్త ఎక్కువగా ఉన్నాయి.. వాళ్లు ఇన్ని రూల్స్ పాటిస్తే కానీ మనకు అందమైన బొమ్మల్లా కనిపిస్తారు..!!

Read more RELATED
Recommended to you

Latest news