నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నాశరీరంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. బరువు పెరుగుతున్నాను. పొట్ట దగ్గర చారలు ఏర్పడుతున్నాయి. అంతా కొత్తగా ఉంది.. అంటూ నగ్నంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది అమీ.
ఈ టైటిల్ చూస్తుంటే మీకు సమీరా రెడ్డి గుర్తుకు వస్తోంది కదా. సమీరా రెడ్డి కూడా తను తొమ్మిదో నెల గర్భిణీగా ఉన్నప్పుడు తను గర్భంతో ఉన్న సమయాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలని… బికినీ వేసుకొని పూల్ లో పోటోషూట్ లో పాల్గొన్నది.
ఇప్పుడు అమీ జాక్సన్ వంతు వచ్చింది. అమీజాక్సన్ తన నిశ్చితార్థానికి ముందే గర్భం దాల్చింది. తన ప్రియుడిని పెళ్లి చేసుకోకముందే గర్భం దాల్చి… ఫోటోలను షేర్ చేసి టాక్ ఆప్ ది టౌన్ అయింది అమీ. గర్భం దాల్చిన తర్వాత బ్రిటన్ కు చెందిన తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేస్తూనే ఉంటుంది.
తాజాగా.. తన గర్భాన్ని చూపిస్తూ నగ్నంగా ఫోటో దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అమీ. తను ప్రస్తుతం 33 వారాల ప్రెగ్నెంట్. ఆ ఫోటోను షేర్ చేసి మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది అమీ.
నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నాశరీరంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. బరువు పెరుగుతున్నాను. పొట్ట దగ్గర చారలు ఏర్పడుతున్నాయి. అంతా కొత్తగా ఉంది.. అంటూ నగ్నంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది అమీ. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు.. అమీ.. తల్లి అవడం అనేది ఎంతో గొప్ప విషయం. అది ఎంతో అదృష్టం. నీకు ఆ అదృష్టం దక్కంది.. అసలైన అమ్మతనం ఇప్పుడే అనుభవించాలి.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
How do you stay fit and healthy during pregnancy? Yoga has been my saviour!!! For the mind AND the body ?? pic.twitter.com/QZPmZXRO2X
— Amy Jackson (@iamAmyJackson) July 20, 2019
View this post on Instagram