ఆరోగ్యం: ప్రతి ఒక్కరి వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఉంటూనే ఉంటాయి. చాలా మంది భార్య భర్తల మధ్య తరచూ ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది కానీ నమ్మకం గౌరవం రెండు భార్యాభర్తల మధ్య ఉండాలి. అప్పుడు రిలేషన్ బాగా దృఢంగా ఉంటుంది అయితే రోజు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. వీలైనంత వరకు సర్దుకుంటూ వెళ్ళిపోతే భార్యాభర్తల బంధం దృఢంగా ఉంటుంది. ఏ మాత్రం చెక్కు చెదరదు. కానీ ప్రతి విషయాన్ని కూడా సాగదీసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. భార్య భర్తలు చిన్న చిన్న విషయానికి.. అవకాశం వచ్చినప్పుడు ఒకరినొకరు ప్రశంసించుకుంటే ఖచ్చితంగా వాళ్ళ బంధం ఇంకా బాగుంటుంది.
పైగా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడి, యాంగ్జైటీ వంటివి తగ్గుతాయి కాబట్టి భార్య అయినా భర్త అయినా ఒకరినొకరు సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ప్రశంసిస్తూ ఉండాలి. టైం వచ్చినప్పుడల్లా మీ జీవిత భాగస్వామిని ప్రశంసిస్తే ఎంతో ప్రశాంతంగా వాళ్ళు మారతారు. రిలాక్స్డ్ గా ఉంటారు. యాంగ్జైటీ ఒత్తిడి తగ్గుతాయి పాజిటివిటీ పెరుగుతుంది. సమస్యలు లేకుండా హాయిగా ఉంటారు అలానే ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం వలన సెల్ఫ్ ఎస్టీమ్ కూడా బాగా పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ ని కూడా వాళ్ళు పెంచుకోవడానికి అవుతుంది.
సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రశంసించడం వలన రిలేషన్ షిప్ కూడా బాగుంటుంది. జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలతో మెలగొచ్చు ఒకరికొకరు కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళ వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది భార్యాభర్తలు సమయం వచ్చినప్పుడు ఒకరినొకరు ప్రశంసించుకోవడం వలన కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది. అలానే భార్యాభర్తలు ఇలా సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రశంసించడం వలన పాజిటివ్ ఇంపాక్ట్ కలుగుతుంది. మూడ్ బాగుంటుంది. ఒత్తిడి తగ్గుతుంది ఫీలింగ్స్ పెరుగుతాయి ఆనందంగా ఉంటారు. ఇలా పూర్తిక వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది ఎంతో మధురంగా ఉంటుంది.