ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా? ఐతే ఇలా చేయండి.

-

కరోనా మహమ్మారి వచ్చి ఎవ్వర్నీ ఇంట్లో నుండి బయటకి రానివ్వలేదు. దాదాపు సంవత్సరం నుండి ఉద్యోగస్తులందరూ ఇంట్లో ఉండే పనులు చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ సేపు కంప్యూటర్ల ముందు కూర్చోవాల్సి వస్తుంది. ఆఫీసులో అయితే ఇది కొంచెం వేరేలా ఉండేది. ఆఫీసుల్లో అప్పుడప్పుడు ఏదో ఒక పని మీద కుర్చీలోంచి లేస్తూనే ఉంటారు. మధ్యాహ్నం లంచ్ అని క్యాంటీన్ వెళ్ళడం, అట్నుంచి సాయంత్రం పూట టేబుల్ టెన్నిస్ మొదలగు ఆటలు ఆడతారు. దీనివల్ల పని మీద మరింత ఆసక్తి కలుగుతుంది.

కానీ ఇంట్లో అవేమీ ఉండవు. అదీగాక ఒక్కరే ఉంటారు కాబట్టి ఖాళీ దొరికితే ఏదైనా సినిమా చూడడమీ, సిరీస్ పెట్టుకోవడమో చేస్తుంటారు. అది కంప్యూటర్ ముందు కూర్చునే. అంటే రోజులో చాలా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందే కూర్చుంటున్నారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా నడుము నొప్పులు, కంటికి సంబంధించిన సమస్యలు ప్రధానమైనవి. మరి వీటి నుండి దూరం కావాలంటే ఎలానో ఇక్కడ తెలుసుకుందాం.

గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల కంప్యూటర్ తెర నుండి వచ్చే నీలి కాంతి మన కళ్ళపై ప్రభావం చూపుతుంది. అందుకే ప్ర్పతీ ఇరవై నిమిషాలకి ఒకసారి కంప్యూటర్ తెర మీద నుండి పక్కకి తిరిగి 20అడుగుల దూరంలో ఉన్న వస్తువు వైపు ఇరవై సెకన్లు కనురెప్పలు కొడుతూ చూడాలి. దీనివల్ల కళ్ళలో నీళ్ళు ఉత్పత్తి అవుతాయి. ఎక్కువ సేఫు ఒకే తెరని చూడడం వల్ల కళ్ళలో తడి తగ్గిపోతుంది. అది తగ్గిపోతే కంటి సమస్యలు వస్తాయి. అందుకే ఇలా ప్రతీ ఇరవై నిమిషాలకి ఒకసారి చేయాలి. కుర్చీలోంచి లేచి కొద్ది సేపు నడిచి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల నడుము నొప్పులు వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news