పాము కుబుసం విడిచినట్లు..ప్రతి వారం..ఆ యువకుడి చర్మం ఊడిపోతుందట..!

-

ఈ ప్రపంచంలో ఎన్నో అంతుచిక్కని రోగాలు ఉన్నాయి. కొన్నింటికి మాత్రమే మెడిసిన్‌ ఉంది. చాలావరకు అరుదైన వ్యాధులు ఉన్నాయి. ఇలాంటివి ఎవరికీ రాకూడదనే అనుకుంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఈ వ్యాధీ నిజంగా దారుణమే చెప్పాలి. పాపం ఆ యువకుడు ఈ వ్యాధితో తన జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నాడు. పాము కుపుసం విడిచే సంగతి మనందిరికి తెలిసే ఉంటుంది. అలా ఆ యువకుడి బాడీపై స్కిన్‌ కూడా ఊడిపోతుంది. ఈ వింత వ్యాధి ఎక్కడో కాదు.. మన దేశంలోనే ఉంది.

బీహార్‌కు చెందిన మజిబర్ రెహ్మాన్ మాలిక్ అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. 25 ఏళ్ల మాలిక్ ఎరిథ్రోడెర్మా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా అతని చర్మం ప్రతి వారం రాలిపోతుంది. ఈ స్థితిలో..రోగి చర్మం ఎర్రగా పొరలుగా మారుతుంది. ఈ వ్యాధిని ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’ అని కూడా అంటారు.

ఈ వ్యాధికి సంబంధించి గ్రామంలోని వైద్యులను సంప్రదించగా.. చికిత్స కోసం నగరంలోని పెద్ద ఆసుపత్రికి వెళ్లాలన్నారు. అయితే మాలిక్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే ఉండటంతో వ్యాధికి తగిన వైద్యం చేయించుకోలేకపోతున్నాడు. మాలిక్‌కు చిన్నతనం నుంచి చదవడం అంటే చాలా ఇష్టం. కానీ ఈ అరుదైన వ్యాధి కారణంగా అతను తన చదువును కొనసాగించలేకపోయాడు. ఎందుకంటే పాఠశాలలో ఉన్న ఇతర పిల్లలు మాలిక్‌ను చూసి భయపడేవారు. అతని మొహం చూసి జనాలు ‘స్నేక్ మ్యాన్’ అని కూడా పిలుస్తారు.

మాలిక్ తన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో తాను రొటీన్‌గా చేసే పనులు చూపించాడు. ఈ వీడియోలో మాలిక్ చర్మం ముడతలు, పొడి, పగుళ్లు.. సున్నితంగా రకరకాలుగా కనిపిస్తుంది. ఈ వ్యాధి మాలిక్ శరీరాన్ని ఈ వ్యాధి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ .. అతని మనోధైర్యాన్ని దెబ్బతీయలేకపోయింది. తన లాంటి వాళ్లను ఎవరూ తక్కువగా చూడొద్దని మాలిక్‌ తెలిపారు.

మాలిక్‌ ఫోటోలు చూస్తే.. నిజంగానే కాస్త భయంకరంగానే ఉంటుంది. అతని ఈ వ్యాధికి ఎందుకు వచ్చింది, ఇది అంటువ్యాధా ఏంటి అని పూర్తిగా తెలియదు.

Read more RELATED
Recommended to you

Latest news