తక్షణమే వివాహం కావాలంటే ఈ వ్రతం ఆచరించండి! (అక్టోబర్‌ 16 అట్లతద్దె వ్రతం ప్రత్యేకం)

-

చాలామంది వివాహం కావడానికి అనేక వ్రతాలు, ఉపవాసాలు చేస్తారు. అయితే ఆచరణలో అత్యంత సులభమై చాలా పవిత్రమై కాకుండా శ్రీఘమే ఫలితం ఇచ్చే వాటిని మాత్రం చేయ్యరు. పురాణ కాలం నుంచి బాగా వాడుకలో ఉన్న వ్రతం అట్లతద్దె. ఆశ్వీజ కృష్ణ/బహుళ తదియను అట్ల తదియగా జరుపుకొంటారు. ఈ వత్రం గురించిన విశేషాలను తెలుసుకుందాం…

గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది.
అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. ‘అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు‘ అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి.

సాయం సమయమందు వాయినలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు. త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగ చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే వ్రతమిది. చంద్ర ఆరాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యం పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడములో ఒక అంతర్ధాము ఉంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. రజోదయానికి కారకుడు కనుక రుతుచక్రం సరిగా వుంచి రుతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భదారణలోఎటువంటి సమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. గర్భస్రావము రాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని ’అట్ల’కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది.అట్లతద్ది పండుగను ఉత్తభారత దేశంలో ’కర్వా ఛౌత్‌’ అనే పేరుతో జరుపుకుంటారు.

అట్లతదియ వ్రతం ఇలా చేసుకోవాలి!
అట్ల తదియ ప్రతి ఆశ్వీజ బహుళ తదియ రోజు జరుపుకొంటారు. ఈ రోజు తెల్లవారుఝామునే మేల్కొని శుచి, శుభ్రతతో స్నానమాచరించి, ఉపవాసముండి, ఇంటిలో తూర్పుదిక్కున మంటపం ఏర్పాటుచేసి గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, స్లోకాలు, పాటలు చదవడము, పాడడం చేస్తారు. సాయంత్రం చంద్రదర్సనము అనంతరము శుచియై తిరిగి గౌరీపూజచేసి, 11 అట్లు నైవేద్యముగాపెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి, 11 అట్లు, 11 ఫలాలు వాయనముగా సమర్పించి, అట్లతద్దినోము కథ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక గుడ్డలు, దక్షిణతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. 11 రకాల ఫలాలను తినడం, 11 మార్లు తాంబూలం వేసుకోవడం, 11 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈపండుగలో విశేషము. దీనినే ’ఉయ్యాలపండగ’ అనీ, ’గోరింటాకుపండగ’ అనీ అంటారు. ఈపండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహంతో పెల్లికాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్తగా లభిస్తాడని, పళ్ళునవారికి పిల్లకు కలుగుతారని, ఐదోతనముతోపాటు, పుణ్యం లభిస్తుందని తరతరాలనుంచి వస్తున్న నమ్మకం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news