‘బీర్ గట్’ వ్యాధి : ఇత‌ని క‌డుపులో బీరు త‌యారుతుంద‌ట‌..

-

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తి.. బ్రిత్‌ అనలైజర్‌తో నటెస్ట్‌ చేస్తే మోతాదుకు మించి తాగినట్టు ఫలితం వచ్చింది.. నిజానికి అతనికి త్రాగే అలవాటు లేదు.. మరి ఏమై ఉంటుంది. తాగకపోయినా తాగినట్టు రిజల్ట్‌ ఎందుకు వచ్చింది.. ఉట్టి పుణ్యానికి ఫైన్‌. ఇదీ ఆ వ్యక్తి వేదన.. అసలు విషయానికి వస్తే.. `ఆటో-బ్రూవరీ సిండ్రోమ్` అనేది ఓ అరుదైన జ‌బ్బు. ఈ జబ్బు ఉన్నవారికి పోలీసులు బ్రెత్ అనలైజర్ పరీక్ష చేస్తే మద్యం తాగినట్టే ఫలితం వస్తుంది. కానీ.. నిజానికి వాళ్లు మద్యం తీసుకోరు.

2014లో 46 ఏళ్ల ఓ వ్యక్తికి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులో మోతాదుకు మించి మద్యం సేవించాడంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. డయగ్నోస్‌ చేస్తే ఆ వ్యక్తి ఆటో బ్రూవరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడని బిఎమ్‌జె ఓపెన్ గ్యాస్ట్రోఎంటరాలజీ పేర్కొంది.  అతని గట్లోని ఫంగల్ ఈస్ట్ కార్బోహైడ్రేట్లను ఆల్కహాల్‌గా మార్చేస్తుందట. ఈ జబ్బు ఉన్నవారు తిన్న కార్బోహైడ్రేట్లు ఆల్కహాల్‌గా మారిపోతుంటాయి. జీర్ణకోశంలో ఉండే ‘శాకరోమైసిస్ సెరివిసీ’ అనే ఒక రకమైన సూక్ష్మజీవి వల్ల ఈ పరిణామం సంభవిస్తుందని పరిశోదనలో తేలింది. దీన్ని ‘బీర్ గట్’ లేదా గట్ ఫర్మెంటేషన్ సిండ్రోమ్ లేదా ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే దాని దుష్పరిణామాలు అనేక రకాలుగా ఉంటాయట.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version